Share News

అటవీ సంపద కాపాడడం అందరి బాధ్యత

ABN , Publish Date - Mar 03 , 2026 | 11:43 PM

ఈసాల తక్కళ్లపల్లి బీట్‌కు చెందిన బుగ్గ అటవీ ప్రాంతంలో మంగళవారం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా పెద్దపల్లి అటవీ రేంజ్‌ అధికారి సతీష్‌ కుమార్‌ అఽధ్వర్యంలో పారెస్టు అధికారులు, సిబ్బంది ప్లాస్టిక్‌ వ్యర్ధాల సేకరణ, శుభ్రత చేపట్టారు.

అటవీ సంపద కాపాడడం అందరి బాధ్యత

పాలకుర్తి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): ఈసాల తక్కళ్లపల్లి బీట్‌కు చెందిన బుగ్గ అటవీ ప్రాంతంలో మంగళవారం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా పెద్దపల్లి అటవీ రేంజ్‌ అధికారి సతీష్‌ కుమార్‌ అఽధ్వర్యంలో పారెస్టు అధికారులు, సిబ్బంది ప్లాస్టిక్‌ వ్యర్ధాల సేకరణ, శుభ్రత చేపట్టారు. అటవీ ప్రాంతంలో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ వ్యర్ధాలను సేకరించి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అటవీ పరిరక్షణే లక్ష్యం, అటవీ సంపదను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు. అడవుల్లో ప్లాస్టి క్‌ వ్యర్ధాలు వన్యప్రాణులకు హానికరమని, వాటిని నివారించాల్సిన అవసరం ఉందని సూ చించారు. డిప్యూటీ రేంజ్‌ అధికారులు దేవ దాస్‌, స్వాతి, కొమురయ్య, ఫారెస్ట్‌ సెక్షన్‌ అధి కారులు మంగిలాల్‌, సతీష్‌, వాయుకుమార్‌, ఫారెస్ట్‌ బీట్‌ అధికారులు మేఘరాజ్‌, వరప్ర సాద్‌, స్రవంతి,అక్తర్‌, పాల్గొన్నారు.

అటవీ శాఖ సిబ్బంది ర్యాలీ

మంథనిరూరల్‌, (ఆంధ్రజ్యోతి): ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. మండలంలోని ఎక్లాస్‌ పూర్‌ గ్రామంలో ర్యాలీ నిర్వహించి వన్యప్రా ణుల గురించి వివరించారు. జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్య, రేంజ్‌ అధికారి వినాయ్‌ నాయక్‌, అధికారులు నరసయ్య, సోనీ కిరణ్‌, అఫ్జల్‌, రాంసింగ్‌, ప్రదీప్‌, శ్రీకాంత్‌, కనుకయ్య, కిష్టయ్య, రవి పాల్గొన్నారు.

Updated Date - Mar 03 , 2026 | 11:43 PM