Share News

గోదావరి పుష్కరాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

ABN , Publish Date - Feb 25 , 2026 | 11:56 PM

గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు అధికా రులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశిం చారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లో 2027లో జరిగే గోదావరి నది పుష్కరాల ఏర్పాట్లపై ఈవైటీం శిశాంత్‌ తోపాటు సంబంధిత అధికా రులతో సమావేశం నిర్వహించారు.

గోదావరి పుష్కరాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

పెద్దపల్లి కల్చరల్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు అధికా రులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశిం చారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లో 2027లో జరిగే గోదావరి నది పుష్కరాల ఏర్పాట్లపై ఈవైటీం శిశాంత్‌ తోపాటు సంబంధిత అధికా రులతో సమావేశం నిర్వహించారు. గోదావరి పుష్క రాలు 2027 జూన్‌ 26 నుంచి జూలై 7 వరకు సాగుతాయని, ఈ మేరకు జిల్లాలో భక్తులు పుణ్య స్నానాలు చేసేందుకు అవసర మైన ఘాట్‌ నిర్మాణాలు, రోడ్డు విస్తరణ, లైటింగ్‌, ఇతర ఏర్పాట్లు, ఆలయాల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసి, త్వరగా అందించాలని ఆయా శాఖల ఇంజనీరింగ్‌ అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో డీసీపీ రాంరెడ్డి, ఎండోమెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ సుప్రియ, డీపీవో వీరబుచ్చయ్య, గోదావరిఖని ఏసీపీ రమేష్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ భావ్‌ సింగ్‌, మిషన్‌ భగీరథ ఈఈ శ్రీనివాస్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2026 | 11:56 PM