పుష్కర ఏర్పాట్ల ప్రతిపాదనలు రూపొందించాలి
ABN , Publish Date - Mar 02 , 2026 | 11:56 PM
గోదావరి పుష్కరాలకు సంబంధించి జిల్లాలో చేయాల్సిన ఏర్పాట్లపై ప్రతిపాదనలు ప్రణాళికబద్దంగా సిద్ధం చేయాలని కలెక్టర్ కోయశ్రీహర్ష తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో 2027 జూన్ 26లో జరగనున్న గోదావరి నది పుష్కరాల ఏర్పాట్లపై రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్‌ఝా, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
పెద్దపల్లి కల్చరల్, మార్చి2(ఆంధ్రజ్యోతి): గోదావరి పుష్కరాలకు సంబంధించి జిల్లాలో చేయాల్సిన ఏర్పాట్లపై ప్రతిపాదనలు ప్రణాళికబద్దంగా సిద్ధం చేయాలని కలెక్టర్ కోయశ్రీహర్ష తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో 2027 జూన్ 26లో జరగనున్న గోదావరి నది పుష్కరాల ఏర్పాట్లపై రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్‌ఝా, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. 12 ఏళ్లకు ఒక్కసారి వచ్చే పుష్కరాలకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లపై ప్రతిపాదనలు సిద్ధం చేసి త్వరగా సమర్పించాలన్నారు. భక్తుల స్నానాలకు ఘాట్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ, లైటింగ్, పార్కింగ్, ఆలయాల అభివృద్ధి తదితర వాటిపై వీలైనంత త్వరగా అందించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని గోలివాడ, మంథని, గోదావరిఖని, సుందిల్ల తదితర ప్రాంతాల్లో గోదావరి ప్రవాహం ఉంటుందని, ఇక్కడ చేయాల్సిన ఏర్పాట్లపై ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందన్నారు. డీసీపీ రాంరెడ్డి, అర్‌అండ్‌బీ ఈఈ భావ్ సింగ్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.