పదోన్నతి బాధ్యతను మరింత పెంచుతుంది
ABN , Publish Date - Aug 30 , 2026 | 11:34 PM
పదోన్నతితో మరింత బాధ్యత పెరుగుతుం దని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీనిజ కోహిర్కర్ అన్నారు. శనివారం రాత్రి అదనపు జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బల్మూరి అమరేందర్‌రావు ఆధ్వర్యంలో శ్రీనిజ కోహి ర్కర్‌ను ఘనంగా సన్మానించారు.
కోల్‌సిటీ, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): పదోన్నతితో మరింత బాధ్యత పెరుగుతుం దని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీనిజ కోహిర్కర్ అన్నారు. శనివారం రాత్రి అదనపు జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బల్మూరి అమరేందర్‌రావు ఆధ్వర్యంలో శ్రీనిజ కోహి ర్కర్‌ను ఘనంగా సన్మానించారు. ఆమె మాట్లాడుతూ జూనియర్ సివిల్ జడ్జి నుంచి సీనియర్ సివిల్ జడ్జిగా పదోన్నతి పొందడం ఆనందంగా ఉందని, ఈ పదవి మరింత బాధ్యతను పెంచుతుందని, న్యాయవాద వృత్తిలో నైపుణ్యాన్ని పెంపొం దించుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సీనియర్ల సలహాలను పాటిం చాలని కోరారు. ఏజీపీ శంతన్ కుమార్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ముచ్చకుర్తి కుమార్, ముక్కెర అంజలి, ఆసంపల్లి రవీందర్, ప్రసన్న, జవ్వాజి శ్రీనివాస్, చిదురాల రమేష్, రాజయ్య, కిషన్‌రావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.