Share News

నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

ABN , Publish Date - Aug 20 , 2026 | 11:52 PM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఎం ఆధ్వర్యం లో కలెక్టరేట్‌ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కల్లెపల్లి అశోక్‌ మాట్లాడుతూ ప్రభుత్వాలు నిరుద్యోగులను మోసం చేస్తున్నాయని విమర్శించారు.

నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

పెద్దపల్లి టౌన్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఎం ఆధ్వర్యం లో కలెక్టరేట్‌ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కల్లెపల్లి అశోక్‌ మాట్లాడుతూ ప్రభుత్వాలు నిరుద్యోగులను మోసం చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగా లను భర్తీ చేయాలని, యేటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని, ఉద్యోగ నియామకాలను నిర్ణీత కాలపట్టిక ప్రకారం చేపట్టాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగ భృతి హామీని అమలు చేయాలని, వయోపరిమితి సడలింపు కల్పించాలని కోరారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉచిత కోచింగ్‌, స్టడీ మెటీరియల్‌, హాస్టల్‌ సౌక ర్యాలు కల్పించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలుపై శ్వేత పత్రం విడుదల చేయాలని, నిరుద్యోగుల సమస్యలు, ప్రభుత్వాల హామీల అమలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు సమర్పించారు. నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకపోతే ఉద్య మాలు చేపడతామని హెచ్చరించారు. సిపెల్లి రవీందర్‌, ఎ జ్యోతి, జిల్లాల ప్రశాంత్‌, మొదంపల్లి శ్రావణ్‌, ఆర్ల సందీప్‌, శ్రీనివాస్‌ రెడ్డి, కుమ్మరి నవీన్‌, ఆదికృష్ణ బర్లా రాకేష్‌, సూరజ్‌, రాహుల్‌, లక్ష్మణ్‌, మారుతీ ఉన్నారు.

Updated Date - Aug 20 , 2026 | 11:52 PM