Share News

ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి

ABN , Publish Date - Jul 02 , 2026 | 11:48 PM

ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, అక్రమ అరెస్ట్‌ చేస్తే భయపడేది లేదని టీఆర్‌ఎస్‌ జిల్లా ఇంఛార్జి సలేంద్ర కొమురయ్య అన్నారు. హైదరాబాదులోని ఉప్పల్‌ బగాయత్‌ ప్రాంతంలో కల్వకుంట్ల కవిత అధ్యక్షతన గురువారం తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల భూమి పంపిణీ చేయాలని ఇచ్చిన పిలుపుమేరకు హైదరా బాదుకు తరలి వెళ్లే క్రమంలో రూరల్‌ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి

పెద్దపల్లి రూరల్‌, జులై 2 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, అక్రమ అరెస్ట్‌ చేస్తే భయపడేది లేదని టీఆర్‌ఎస్‌ జిల్లా ఇంఛార్జి సలేంద్ర కొమురయ్య అన్నారు. హైదరాబాదులోని ఉప్పల్‌ బగాయత్‌ ప్రాంతంలో కల్వకుంట్ల కవిత అధ్యక్షతన గురువారం తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల భూమి పంపిణీ చేయాలని ఇచ్చిన పిలుపుమేరకు హైదరా బాదుకు తరలి వెళ్లే క్రమంలో రూరల్‌ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఆయన మాటా ్లడుతూ భూ పోరాటానికి వెళ్లకుండా ఇచ్చిన హామీ లను నెరవేర్చకుండా కవితను అరెస్ట్‌ చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. అక్రమ అరెస్టులు ఉద్యమ కారుల హక్కులను ఆపలేవని పేర్కొన్నారు. దేవ నంద్‌ లక్ష్మయ్య, సిహెచ్‌ హనుమాన్లు, బొంకూరి సుభాష్‌, కలవల రవీందర్‌, గంధం శంకరయ్య, శంకరయ్య, అంబాల మహేష్‌, మహేష్‌ ఉన్నారు.

యైుటింక్లయిన్‌కాలనీ, (ఆంధ్రజ్యోతి): ఉప్పల్‌ బగాయత్‌లో తెలంగాణ రక్షణ సేన ఆందోళనకు వెళ్ళ నున్నారనే సమాచారంతో గోదావరిఖని టూటౌన్‌ పోలీసులు టీఆర్‌ఎస్‌ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. కండెం సురేష్‌తోపాటు టీఆర్‌ఎస్‌, హెచ్‌ఎంఎస్‌ సెంట్రల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రత్నాకర్‌రెడ్డిని ముందస్తు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఎందరో త్యాగాల ఫలితంగా తెలంగాణ సాధించు కున్నామని, కానీ ప్రభుత్వాలు ఉద్యమ కారులకు న్యాయం చేయలేదని సురేష్‌, రత్నాకర్‌లు తెలిపారు. ఉద్యమకారులకు ఇంటి స్థలం, ఇతర సంక్షేమ పథకాలు ఇవ్వాలని కవిత చేస్తున్న ఆందోళనకు పోలీసులు అడ్డుకోవడం సరికాదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉద్యమ కారులకు న్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

సుల్తానాబాద్‌, (ఆంధ్రజ్యోతి): సుల్తానాబాద్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు బొంకూరు ఐలయ్యను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. కవిత అక్రమ అరెస్టును ఆయన ఖండించారు.

Updated Date - Jul 02 , 2026 | 11:48 PM