Share News

యువత ఆర్థిక స్వావలంబనతోనే ప్రగతి

ABN , Publish Date - Nov 22 , 2026 | 11:19 PM

మహిళల ఆర్థిక స్వావ లంబనతోనే కుటుంబంతోపాటు సమాజం సమగ్రాభివృద్ధి చెందుతుందని బీసీ జేఏసీ జిల్లా చైర్‌పర్సన్‌ దాసరి ఉష అన్నారు. నిరుద్యోగ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆదివారం సింధూర ఐటీఐ కాలేజీ క్యాంపస్‌లో సురక్ష మ్యాన్‌పవర్‌ సర్వీసెస్‌, ఫిట్‌ అండ్‌ ఫ్యూచర్‌ క్లబ్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా జాబ్‌ మేళాకు విశేష స్పందన లభించింది.

యువత ఆర్థిక స్వావలంబనతోనే ప్రగతి

పెద్దపల్లి కల్చరల్‌, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): మహిళల ఆర్థిక స్వావ లంబనతోనే కుటుంబంతోపాటు సమాజం సమగ్రాభివృద్ధి చెందుతుందని బీసీ జేఏసీ జిల్లా చైర్‌పర్సన్‌ దాసరి ఉష అన్నారు. నిరుద్యోగ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆదివారం సింధూర ఐటీఐ కాలేజీ క్యాంపస్‌లో సురక్ష మ్యాన్‌పవర్‌ సర్వీసెస్‌, ఫిట్‌ అండ్‌ ఫ్యూచర్‌ క్లబ్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా జాబ్‌ మేళాకు విశేష స్పందన లభించింది. దాదాపు 500 మంది మహిళలు పాల్గొనగా ఫాక్స్‌ కాన్‌ ఎలకా్ట్రనిక్స్‌ కంపెనీలో పలువురు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఫాక్స్‌కాన్‌ ప్రతినిధులు మాట్లాడుతూ..హైదరాబాద్‌ యూనిట్‌లో ప్రస్తుత 8 వేల మంది పని చేస్తున్నారని, అందులో 6 నుంచి 7 వేల మంది మహిళలే ఉన్నారని తెలిపారు. రాబోయే మూడేళ్లలో ఈ సంఖ్య 33 వేలకు పెరుగుతుందన్నారు. ఉద్యోగులకు భోజనం, బస్సు సౌకర్యం తోపాటు రాత్రి షిఫ్టులలో భద్రతా సిబ్బందితో రవాణా, పిఎఫ్‌, ఈఎస్‌ఐ అందిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా దాసరి ఉష మాట్లాడు తూ.. ఉద్యోగాల్లో చేరే మొదటి రోజు తాను కూడా వస్తానని, గెట్‌ టు గెదర్‌ ఏర్పాటు చేసి వారి జీతభత్యాలు, వసతి సౌకర్యాలను పరి శీలిస్తానని భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకం కింద నాలుగు నెలల నైపుణ్య శిక్షణ ఇచ్చి ప్లేస్‌మెంట్‌ కల్పిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ యువత ఆత్మవిశ్వాసంతో పనిచేసి, భవిష్యత్తులో పెద్దపల్లిలోనే సొంతంగా కంపెనీలు స్థాపించే పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఫాక్స్‌కాన్‌ ప్రతినిధులు వీర్‌, మహేష్‌, సురక్ష మ్యాన్‌పవర్‌ సర్వీసెస్‌ ప్రతినిధులు దినేష్‌, కిరణ్‌, రజిత, మమత, రోహిత్‌, రాహుల్‌, హనీ, అక్షయ్‌, ప్రదీప్‌, రాకేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2026 | 11:19 PM