ఆయిల్‌పామ్ సాగుతో లాభాలు
ABN , Publish Date - Jul 09 , 2026 | 11:38 PM
ఖర్చు తక్కువగా ఉండి అత్యధి క లాభాలు రావాలంటే రైతులు ఆయిల్‌పామ్ సాగుపై ఆసక్తి చూపాలని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్‌పామ్ రీసర్చ్ సంస్థ ప్రఽధాన శాస్త్ర వేత్త డాక్టర్ రాంచంద్రుడు అన్నారు. సుల్తానాబాద్ మండలం కొదురు పాకలో గురువారం మెగా అయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వ హించారు.
సుల్తానాబాద్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): ఖర్చు తక్కువగా ఉండి అత్యధి క లాభాలు రావాలంటే రైతులు ఆయిల్‌పామ్ సాగుపై ఆసక్తి చూపాలని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్‌పామ్ రీసర్చ్ సంస్థ ప్రఽధాన శాస్త్ర వేత్త డాక్టర్ రాంచంద్రుడు అన్నారు. సుల్తానాబాద్ మండలం కొదురు పాకలో గురువారం మెగా అయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వ హించారు. కొదురుపాక పంచాయతీ పరిధిలోని వాగొడ్డుపల్లికి చెందిన దేవరనేని రాజేశ్వర్‌రావు ఇరవై ఎకరాలలో పంట సాగు చేసే కార్యక్రమంలో భాగంగా గురువారం మొక్కలు నాటారు. శాస్త్రవేత్త మొక్కలు నాటి పలు సలహాలు సూచనలు అందించారు. ఆయిల్ పామ్ పంట దీర్ఘకాలికమైన పంట అని, నాటిన మూడో సంవత్సరం నుంచి దిగుబడి అందుతుంద న్నారు. అంతర పంటలతో అదనపు ఆదాయం వచ్చే ఆయిల్‌పామ్ సాగు ఉత్తమమన్నారు. జిల్లా ఉద్యానవనశాఖ అధికారి శ్యామ్ ప్రసాద్ మాట్లా డుతు ఈ పంటలను ప్రొత్సహించడంలో భాగంగా ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుందని వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 20 ఎకరా లలో పంట మొక్కలు నాటించిన రైతుతో పాటు సింగిల్ విండో చైర్మన్ దేవరనేని మోహన్‌రావును అధికారులు సన్మానించారు. తిరుమల ఆయిల్ పామ్ సీఈవో కేషు కల్యాంకర్, ఉద్యాన వన విస్తీర్ణ అధికారులు మహేష్, ఆయిల్ ఫామ్ పీల్డ్ ఆఫీసర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.