Share News

భూ భారతి రీ సర్వేతో సమస్యలు పరిష్కారం

ABN , Publish Date - Oct 07 , 2026 | 12:00 AM

భూ భారతి రీ సర్వే ద్వారా క్షేత్ర స్థాయిలో ప్రతీ భూమి హద్దును నిర్ధారించి భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. మంగళవా రం ఇందూర్తిలో నిర్వహించిన రీ సర్వే అవగాహన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు.

భూ భారతి రీ సర్వేతో సమస్యలు పరిష్కారం

ఓదెల, అక్టోబర్‌ 6 (ఆంధ్రజ్యోతి): భూ భారతి రీ సర్వే ద్వారా క్షేత్ర స్థాయిలో ప్రతీ భూమి హద్దును నిర్ధారించి భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. మంగళవా రం ఇందూర్తిలో నిర్వహించిన రీ సర్వే అవగాహన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో 1938లో భూ సర్వే నిర్వ హించారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాల్లో సమగ్ర రీసర్వే నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. భూముల హద్దులు, రికార్డులలో మార్పులతో సమస్యలు వచ్చాయని, పట్టాదారు పాస్‌పుస్తకాల్లో మార్పు జరిగినప్పటికీ క్షేత్రస్థాయిలో భూమికి సంబం ధించిన మ్యాప్‌ అందుబాటులో లేకపోవడం వల్ల భూముల విస్తీర్ణం లో తేడాలు, హద్దులకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రతీ భూమిని క్షేత్రస్థాయిలో సర్వే చేసి హద్దులను నిర్ధారిస్తామని చెప్పారు. జిల్లాలో మొదటి దశలో 70 గ్రామాలను ఎంపిక చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. భూ వివరాలపై ప్రజలకు 21 రోజుల గడువు ఇస్తా మని, అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం పరిష్కరిస్తామని పేర్కొన్నారు. అనంతరం ఆన్‌లైన్‌లో నమోదు చేసి భూధార్‌ కార్డు లను జారీ చేస్తామని తెలిపారు. సర్వే సమయంలో రైతులు భూముల వద్ద అందుబాటులో ఉండాలన్నారు. సర్పంచ్‌ కంకణాల లావణ్య, భాస్కర్‌ రెడ్డి,పడాల భాగ్య లక్ష్మి,రాజు తహసీల్దార్‌ వనజ, అధికారులు,సర్వే సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2026 | 12:00 AM