ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణంలో నిరుపేదలకు ప్రాధాన్యం
ABN , Publish Date - Sep 25 , 2026 | 12:02 AM
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నిరుపేదలకు మొదట ప్రాధాన్యం కల్పి స్తామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ. సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో అంత ర్గత సమావేశం నిర్వహించిన అనంతరం అడ్లూరి మీడి యాతో మాట్లాడారు.
ధర్మారం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నిరుపేదలకు మొదట ప్రాధాన్యం కల్పి స్తామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ. సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో అంత ర్గత సమావేశం నిర్వహించిన అనంతరం అడ్లూరి మీడి యాతో మాట్లాడారు. మండల కేంద్రంలోని జక్కన్నపల్లి తోపాటు తహసీల్దార్ కార్యాలయ సమీపంలో గల ఒక ఎకరంలో ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి లే అవుట్ చేస్తా మన్నారు. మండలంలోని పత్తిపాక, నర్సింగాపూర్, బొమ్మరెడ్డిపల్లి, ఖిలావనపర్తి గ్రామాల్లో కొందరు ప్రభుత్వ భూములను ఆక్రమించారని పేర్కొన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా ఆక్ర మదారుల వద్ద ఉన్న ప్రభుత్వ భూములను తీసుకొని పేద వారికి పంచుతామని, ఆ భూములను వెంటనే గుర్తించాలని తహసీల్దార్ శ్రీనివాస్‌ను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. బొమ్మరెడ్డిపల్లి శివారులోని 679లోని 79 ఎకరాల ఇనాం భూమిని కొందరు ఆక్రమిస్తే ప్రభు త్వం తిరిగి తీసుకుందని గుర్తు చేశారు. దళితులకు నయానో, బయానో ముట్టజెప్పి ఇనాం భూములను కొనుగోలు చేసిన వారు ప్రభుత్వం భూమి తీసుకున్న తరువాత కోర్టుకెల్లారని, ఎట్టి పరిస్థితుల్లో సంపన్న వర్గాల భూ ఆక్రమ దారులను క్షమించేది లేదని హెచ్చరించారు. ఎర్రగుం టపల్లి సమీపంలో నిర్మించతలపెట్టిన ఏటీసీ సెంటర్‌కు టెండర్లు పూర్తయ్యా యని, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ చేతుల మీదుగా పనులు ప్రారంభిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్య క్షుడు లావుడ్య రూప్లానాయక్, డీసీసీ జనరల్ సెక్రెటరీ తిరుపతిరెడ్డి, డీసీసీ సెక్రె టరీ కొత్త నర్సింహులు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రంజిత్, ఖిలావనపర్తి ఆలయ చైర్మన్ పోలుదాసరి సంతోష్, నాయకులు పాలకుర్తి రాజేశం, దేవి జనార్దన్, కాడె సూర్య నారాయణ, ద్యాగేటి ఉదయ్, ఉప సర్పంచ్ మల్లేశం, ఓరెం చిరంజీవి, సర్పంచులు పాల్గొన్నారు.