Share News

పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలి

ABN , Publish Date - Jul 10 , 2026 | 11:58 PM

జిల్లాలో పూర్వ ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేసి, చిన్నారులకు నాణ్యమైన విద్యనందిం చాలని ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లకు కలెక్టర్‌ కోయశ్రీహర్ష సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఓరియంటేషన్‌ ప్రోగ్రాం నిర్వహించారు.

పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలి

పెద్దపల్లి కల్చరల్‌, జూలై10(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పూర్వ ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేసి, చిన్నారులకు నాణ్యమైన విద్యనందిం చాలని ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లకు కలెక్టర్‌ కోయశ్రీహర్ష సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఓరియంటేషన్‌ ప్రోగ్రాం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో గత విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠ శాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను విజయవంతంగా అమలు చేస్తున్నా మని తెలిపారు. గత ఏడాది 63 పాఠశాలల్లో ప్రారంభించిన ఈ కార్యక్ర మాన్ని ప్రస్తుత విద్యాసంవత్సరం మరో 48 పాఠశాలలకు విస్తరించడంతో 110 పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లు పాఠశాలల్లో విద్యార్థుల నమోదుకు కీలకమన్నారు. చిన్నారులకు నాణ్యమైన విద్యతోపాటు ఆటలు, పాటలు, కార్యాచరణ ఆధారిత బోధన అందించడం ద్వారా తల్లితండ్రుల్లో ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెరుగుతుందని కలెక్టర్‌ తెలిపారు. ఈ శిక్షణ ద్వారా ఇన్‌స్ట్రక్టర్లు చిన్నారులకు బలమైన విద్యా పునాదులను వేసేలా పని చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. డీఈఓ శారద, జిల్లా అకాడమిక్‌ అధికారి షేక్‌, రిసోర్స్‌ పర్సన్స్‌, ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లు పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2026 | 11:58 PM