క్షయ వ్యాధిపై జాగ్రత్తలు తీసుకోవాలి
ABN , Publish Date - Mar 24 , 2026 | 11:46 PM
క్షయ వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రమోద్‌కుమార్ సూచించారు. ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం పురస్కరించుకొని అవగాహన ర్యాలీని నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. ప్రమోద్‌కుమార్ జెండా ఊపి ప్రారంభించారు.
పెద్దపల్లి టౌన్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): క్షయ వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రమోద్‌కుమార్ సూచించారు. ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం పురస్కరించుకొని అవగాహన ర్యాలీని నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. ప్రమోద్‌కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ జిల్లా ప్రధాన ఆసుపత్రి, పెద్దపల్లి నుంచి ప్రారంభమె అమర్‌చంద్ ఫంక్షన్ హాల్ వరకు కొనసాగింది. అనంతరం క్షయవ్యాధిపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ‘అవును, మనం టీబీని అంతం చేయగలం’ అనే నినాదంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. క్షయవ్యాధి మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ అనే సూక్ష్మక్రిమి వల్ల వస్తుందని, టీబీ రోగి దగ్గు, తుమ్ము, మాట్లాడినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుందని వివరించారు. టీబీ ముఖ్య లక్షణాలు రెండు వారాలకు మించిన దగ్గు, జ్వరం, ఆకలి లేకపోవడం, రాత్రిపూట చెమటలు పట్టడం, బరువుతగ్గడం లక్షణాలు కనబడుతాయన్నారు. లక్షణాలు ఉన్నవారు తెమడ పరీక్ష, ఛాతి ఎక్స్‌రే వంటి పరీక్షలు వైద్యుల సూచన మేరకు చేయించుకోవాలని సూచించారు. సాధారణ టీబీ రోగులకు 6 నెలల పాటు ఉచిత చికిత్స అందిస్తారని తెలిపారు. మొదటి 2 నెలల ఇంటెన్సివ్ దశలో 4 రకాల మందులు. అనంతరం మళ్లీ పరీక్షలు చేసి తదుపరి చికిత్స కొనసాగిస్తారన్నారు. డ్రగ్ రెసిస్టెంట్ టిబి (ముదిరిన టిబి) విషయంలో, గతంలో చికిత్సను పూర్తిగా చేయకపోవడం వల్ల క్రిమి మందులకు ప్రతిఘటన కలుగుతుందని, ఇలాంటి రోగులకు 8 రకాల శక్తివంతమైన మందులతో 1 నుంచి 2 సంవత్సరాల పాటు చికిత్స అవసరమని తెలిపారు. ప్రోగ్రాం అధికారులు డా. శ్రీరాములు, డా. కె.వి. సుధాకర్ రెడ్డి, డాక్టర్ బి కిరణ్ కుమార్, ఏఆర్‌టి మెడికల్ ఆఫీసర్ అలేఖ్య, ఐఆర్‌సిఎస్ అధ్యక్షుడు రాజగోపాల్, డి. శ్రీనివాస్, ఎస్. వెంకటేశ్వర్లు, టిబి ఛాంపియన్స్ ఎన్‌జీవోలు, పీహెచ్‌సీ సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఇతర వైద్య సిబ్బంది, తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థినులు పాల్గొన్నారు.