ఓసీపీల్లో ముందస్తు చర్యలు చేపట్టాలి
ABN , Publish Date - May 28 , 2026 | 11:49 PM
వానాకాలంలో ఓసీపీలో ఉత్పత్తికి విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సింగ రేణి సంస్థ చైర్మన్‌అండ్‌మేనేజింగ్ డైరెక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి అన్నారు. గురువారం ఆర్జీ-2 ఏరియాలో పర్యటించారు. ఓసీపీ-3 సీహెచ్‌పీ ఆధునికీకరణ పనులను పరిశీలించారు.
యైుటింక్లయిన్‌కాలనీ, మే 28(ఆంధ్రజ్యోతి): వానాకాలంలో ఓసీపీలో ఉత్పత్తికి విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సింగ రేణి సంస్థ చైర్మన్‌అండ్‌మేనేజింగ్ డైరెక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి అన్నారు. గురువారం ఆర్జీ-2 ఏరియాలో పర్యటించారు. ఓసీపీ-3 సీహెచ్‌పీ ఆధునికీకరణ పనులను పరిశీలించారు. ఆర్జీ-2 జీఎం బండి వెంకట య్య బొగ్గు రవాణాపై వివరించారు. అనంతరం ప్రాజెక్టు వ్యూ పాయిం ట్ నుంచి ఓసీపీ-3ని సీఎండీ పరిశీలించారు. యంత్రాల పనితీరు, ఓబీ వెలికితీత పనులపై తెలుసుకున్నారు. వర్షాకాలం ప్రారంభం కానున్న దృష్ట్యా వరద నీరు ప్రాజెక్టు క్వారీలో నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఏరియాలోని సింగరేణి రెస్క్యూ ప్రధానస్టేషన్‌ను సందర్శించారు. అంతర్జాతీయ పోటీల్లో అండర్ గ్రౌండ్ రెస్క్యూ పోటీల్లో ప్రథమ స్థానం సాధించడంపై సిబ్బం దిని అభినందించారు. సీఎండీని జీఎం బండి వెంకటయ్య పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానించారు. డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ (ఆపరేషన్స్), వెంకటేశ్వర్లు (పీపీ), తిరుమలరావు (ఈఅండ్‌ఎం), రీజియన్ జీఎంలు లలిత్‌కుమార్, మధుసూదన్ ఎస్వోటూ జీఎం రాముడు ఉన్నారు.