Share News

జూన్‌ 2లోగా పీఆర్సీ అమలుచేయాలి

ABN , Publish Date - Apr 17 , 2026 | 11:43 PM

జూన్‌ 2వ తేదీలోగా ఉద్యోగులకు పీఆర్సీని అమలు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశా రు. శుక్రవారం రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేర కు కలెక్టరేట్‌ ఉద్యోగులందరూ భోజన విరామం లో నల్ల బ్యాడ్జీలతో ధర్నా నిర్వహించారు.

జూన్‌ 2లోగా పీఆర్సీ అమలుచేయాలి

పెద్దపల్లి, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): జూన్‌ 2వ తేదీలోగా ఉద్యోగులకు పీఆర్సీని అమలు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశా రు. శుక్రవారం రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేర కు కలెక్టరేట్‌ ఉద్యోగులందరూ భోజన విరామం లో నల్ల బ్యాడ్జీలతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు మాటా ్లడుతూ పీఆర్సీ జూన్‌ 2వ తేదీలోగా అమలు చేయాలని, నగదు రహిత ఆరోగ్య భద్రత కార్య క్రమంను మే 1వ తేదీ నుంచి ఎలాంటి నిబం ధన లేకుండా అందరికీ వర్తించేటట్లు నియమా వళి తేవాలని, బిల్లులను వెంటనే చెల్లించాలని, సీపీఎస్‌ను రద్దు చేసి ఉద్యోగులందరికీ ఓపీఎస్‌ నువర్తింప చేయాలని కోరారు. జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ ఛైర్మన్‌ బొంకూరి శంకర్‌, జేఏసీ సెక్రటరీ జనరల్‌ తూము రవీందర్‌, టీజీఓ సంఘ బాధ్యులు రంగారెడ్డి, కరుణాకర్‌, రవీం దర్‌, బ్రహ్మానందరెడ్డి, సాజిద్‌ అలీ, రవీంద్రనాథ్‌, ఉమాదేవి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2026 | 11:43 PM