వాయిదాపడిన మంత్రుల పర్యటన
ABN , Publish Date - Aug 16 , 2026 | 11:57 PM
సుల్తానాబాద్ పట్టణంలో మంత్రుల పర్యటన కార్యక్రమం వాయిదా పడింది. సోమవారం మం త్రుల పర్యటనకు ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆధ్వర్యంలో జూనియర్ కళాశాల మైదానంలో అన్ని ఏర్పాట్ల పూర్త య్యాయి. అనివార్య కారణాల వల్ల ఈనెల 19కి వాయిదా పడిందని నాయకులు తెలిపారు.
సుల్తానాబాద్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): సుల్తానాబాద్ పట్టణంలో మంత్రుల పర్యటన కార్యక్రమం వాయిదా పడింది. సోమవారం మం త్రుల పర్యటనకు ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆధ్వర్యంలో జూనియర్ కళాశాల మైదానంలో అన్ని ఏర్పాట్ల పూర్త య్యాయి. అనివార్య కారణాల వల్ల ఈనెల 19కి వాయిదా పడిందని నాయకులు తెలిపారు. రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, దుద్ధిళ్ళ శ్రీధర్‌బాబు తదితరులు పర్యటించనున్నారు. రహ దారి పనులు, పూసాల చౌరస్తాలో సెంట్రల్ లైటింగ్ పనులకు ప్రారం భోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు. ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మం డలాలకు చెందిన పలు అభివృద్ధి పనుల శిలాఫలకాలు ఇక్కడే ఆవిష్క రించనున్నారు. సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబందించిన పనులు నాలుగైదు రోజుల నుంచి చురుగ్గా సాగుతున్నాయి. మంత్రుల పర్యటన, సభ నిర్వహణ నేపథ్యంలో సీఐ రంజిత్ రావు, ఎస్‌ఐ చంద్రకుమార్ తదితరులు ఆదివారం సభా ఏర్పాట్లు పరిశీలించారు. వేదిక, వీఐపీలు వచ్చి వెళ్ళే ప్రాంతాలను పరిశీలించారు. వాహనాల పార్కింగ్ తదితర అంశాల గురించి, బందోబస్తు ఏర్పాట్ల గురించి సమీక్షించారు.
పవర్‌హౌస్ వద్ద ఏర్పాట్లు పరిశీలన
అంతర్గాం, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): రామగుండం నియోజకవర్గ పరి ధిలో ఈ నెల 19న మంత్రులు పర్యటించనున్నట్లు మేయర్ మహంకాళి స్వామి పేర్కొన్నారు. పలు అబివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయను న్నారని, ఈ మేరకు సభాస్థలాన్ని పలువురు నాయకులతో కలిసి పరిశీలిం చారు. ఏ పవర్ హౌస్ కూడలిలో మంత్రుల సభాస్థలి ఏర్పాట్లను పరిశీలించి, పారిశుధ్య నిర్వహణ, ఇతరత్రా ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం, మాడల్ రహదారులు, ఐటీఐ రహదారి నిర్మా ణంతోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. ఈ పర్యటనలో రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. కార్పొరేటర్లు ఇసంపెల్లి అంజుల సిరిశెట్టి సతీష్ గౌడ్, దారంగుల కుమార్, గట్ల రమేష్, సీనియర్ నాయకులు అయోధ్య సింగ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.