Share News

సంఘటిత శక్తితోనే రాజకీయ ప్రయోజనాలు

ABN , Publish Date - Jun 15 , 2026 | 12:01 AM

సంఘటిత శక్తితోనే మున్నూరు కాపులకు రాజ కీయ ప్రమోజనాలు కలుగుతాయని ఆ సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు పుట్టం పురుషోత్తం పేర్కొన్నారు. ఆదివారం ఆర్‌ఆర్‌ గార్డెన్‌లో జిల్లా మున్నూరు కాపు సంఘం ఎన్నికలు నిర్వహించారు. జడల సురేందర్‌ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

సంఘటిత శక్తితోనే రాజకీయ ప్రయోజనాలు

పెద్దపల్లి టౌన్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): సంఘటిత శక్తితోనే మున్నూరు కాపులకు రాజ కీయ ప్రమోజనాలు కలుగుతాయని ఆ సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు పుట్టం పురుషోత్తం పేర్కొన్నారు. ఆదివారం ఆర్‌ఆర్‌ గార్డెన్‌లో జిల్లా మున్నూరు కాపు సంఘం ఎన్నికలు నిర్వహించారు. జడల సురేందర్‌ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలకు ముఖ్య అతిథిగా హాజరైన పురుషోత్తం మాట్లాడుతూ మున్నూరు కాపులు అన్ని రంగాల్లోనూ రాణిం చే సత్తా ఉన్నారని, ప్రస్తుతం జరుగుతున్న జనగణనలో మున్నూరు కాపుల సంఖ్యను తక్కువగా చూపుతున్నారని, ఇది సామాజిక, రాజకీయ వాటాను దెబ్బతీస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని అధిగమించేం దుకు ప్రతీ యువకుడు బాధ్యతగా గ్రామా ల్లోని ఇంటింటి వెళ్ళి వివరాలను సేకరించి, సరైన గణాంకాలను ప్రభుత్వా నికి అందించాలని పిలుపుని చ్చారు. చట్టసభల్లో మున్నూరు కాపులకు రావాల్సిన సముచిత వాటాను సాధించుకునేందుకు సంఘం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు .జిల్లా కేంద్రంలో మున్నూరు కాపుల కమ్యూనిటీ హాల్‌, పేద విద్యా ర్థుల కోసం ప్రత్యేక హాస్టల్‌ ఏర్పాటు చేయ డమే లక్ష్యమని, స్థల సేకరణకు సంబంధించి ప్రభుత్వం, స్థానిక నాయకుల మద్దతుతో అధ్య క్షుడు ముందుకు సాగాలన్నారు. అన్ని కుల సంఘాలతో సమన్వయం చేసుకుంటూ సమా జాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేప ట్టిన జడల సురేందర్‌ మాట్లాడుతూ కుల ఐక్యత కోసం నిరంతరం శ్రమిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్ది పెంటయ్య, కార్యదర్శి ఇసంపల్లి వెంకన్న పటేల్‌, మల్క రామస్వామి, ఎలువాక రాజ య్య, అమిరిశెట్టి రామస్వామి, బిరుదు కృష్ణ, తూముల శ్రీనివాస్‌, బండారు రామ్మూర్తి, ఆకుల మహేందర్‌, గంట రమేష్‌, విజయలక్ష్మి తదితరులు అధ్యక్షుడిని సన్మానించారు.

Updated Date - Jun 15 , 2026 | 12:01 AM