Share News

పోలీసులు దేహదారుఢ్యాన్ని పెంపొందించుకోవాలి

ABN , Publish Date - Aug 23 , 2026 | 11:57 PM

పోలీసులు దేహదారుఢ్యాన్ని పెంపొందించుకోవాలని ఎస్‌ఐ చంద్ర కుమార్‌ అన్నారు. ఆదివారం సుల్తానాబాద్‌లో నిర్వహిం చిన 10 కే రన్‌ కార్యక్రమాన్ని ఎస్‌ఐ చంద్రకుమార్‌ పోలీసు సిబ్బందితో కలిసి ప్రారం భించారు.

పోలీసులు దేహదారుఢ్యాన్ని పెంపొందించుకోవాలి

సుల్తానాబాద్‌, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): పోలీసులు దేహదారుఢ్యాన్ని పెంపొందించుకోవాలని ఎస్‌ఐ చంద్ర కుమార్‌ అన్నారు. ఆదివారం సుల్తానాబాద్‌లో నిర్వహిం చిన 10 కే రన్‌ కార్యక్రమాన్ని ఎస్‌ఐ చంద్రకుమార్‌ పోలీసు సిబ్బందితో కలిసి ప్రారం భించారు. ఆయన మాట్లాడుతూ, విధుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండే పోలీసు సిబ్బంది తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిం చాలన్నారు. రోజూ కొంత సమయాన్ని వ్యాయామానికి కేటా యించడం ద్వారా శారీరక దారుఢ్యం తోపాటు ఆరోగ్యాన్ని కాపాడుకో వచ్చని సూచించారు. పోలీసులు ఆరోగ్యంగా ఉంటే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వీలవుతుందని తెలిపారు. ప్రజా భద్రత కోసం పోలీ సులు చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.

Updated Date - Aug 23 , 2026 | 11:58 PM