బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల దాడి దుర్మార్గం
ABN , Publish Date - Sep 08 , 2026 | 12:21 AM
అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులపై పోలీసులు దురుసుగా వ్యవహరించ డం, దాడి చేయడం దుర్మార్గమని నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మె ల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. సోమవారం పెద్దపల్లి బస్టాండ్ వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించి సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
పెద్దపల్లి, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులపై పోలీసులు దురుసుగా వ్యవహరించ డం, దాడి చేయడం దుర్మార్గమని నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మె ల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. సోమవారం పెద్దపల్లి బస్టాండ్ వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించి సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నల్ల టీషర్టులు ధరించి శాంతియుతంగా అసెంబ్లీకి వెళ్లారని తెలిపారు. అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద పోలీసులు అడ్డుకుని తోపులాటకు పాల్పడటం, నాయకులను అదుపులోకి తీసుకోవడం దుర్మార్గమని విమర్శించారు. అసెంబ్లీలో ప్రశ్నిం చే ప్రతిపక్ష ఎమ్మెల్యేల హక్కులను కాలరాయడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనన్నారు. మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు దురుసుగా వ్యవహరించారన్నారు. ఎన్ని నిర్బంధాలు, కేసులు, దాడులు ఎదురైనా ప్రజాసమస్యలపై బీఆర్‌ఎస్ పోరాటం ఆగదని, ప్రజాస్వామ్య పరిరక్షణకు పార్టీ శ్రేణులు ఐక్యంగా పోరాడుతాయని స్పష్టం చేశారు. మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు ఉప్పు రాజ్‌కు మార్, మర్కు లక్ష్మన్, పడాల సతీష్ గౌడ్, కొయ్యెడ సతీష్ పాల్గొన్నారు.