ఘనంగా పోచమ్మ బోనాలు
ABN , Publish Date - Mar 12 , 2026 | 12:09 AM
ఉగాది పండుగ సమీపి స్తున్నందున గోదావరిఖని పట్టణంలో బుధవారం పోచమ్మ బోనాల ను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకొని డప్పు చప్పుళ్లతో మేకలను చేతబట్టుకొని ఊరే గింపు నిర్వహించారు.
కళ్యాణ్‌నగర్, మార్చి11(ఆంధ్రజ్యోతి): ఉగాది పండుగ సమీపి స్తున్నందున గోదావరిఖని పట్టణంలో బుధవారం పోచమ్మ బోనాల ను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకొని డప్పు చప్పుళ్లతో మేకలను చేతబట్టుకొని ఊరే గింపు నిర్వహించారు. పోచమ్మకు మొక్కలు చెల్లించారు. ఐబీ కాల నీ, విఠల్‌నగర్, తిలక్‌నగర్, అడ్డగుంటపల్లి, ఇందిరానగర్, గంగ నగర్, బాపూజీ నగర్, పోచమ్మ ఆలయాలు కిటకిటలాడాయి. పోచ మ్మకు కల్లు, బెల్లం శాకం చెల్లించారు.
ఓదెల, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో కాపు సంఘం ఆధ్వ ర్యంలో పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించారు. ప్రతి ఇంటి నుంచి బోనాలతో పోచమ్మకు సమర్పించారు. గ్రామంలో పంబాల కళాకారుల నృత్యాలు పలువురిని ఆకర్షించాయి. ఉగాది పర్వది నాన్ని పురస్కరించుకోని ముందుగా గ్రామ దేవతలకు బోనాలను సమర్పించడం ఆనవాయితీ. సర్పంచ్ కనికి రెడ్డి సతీష్, మాజీ జెడ్పిటిసి గంట రాములు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ నరేష్, మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, నాయకులుకృష్ణ పాల్గొన్నారు.
జూలపల్లి, (ఆంధ్రజ్యోతి): జూలపల్లి మండలకేంద్రంతో పాటు వడుకాపూర్, ఆయా గ్రామాల్లోని ప్రజలు పోచమ్మతల్లి ఆలయా నికి బోనాలతో తరలివచ్చి మొక్కులను తీర్చుకున్నారు. పిల్లా పాపలను చల్లంగా చూడాలని వేడుకున్నారు. సర్పంచ్ పాటకుల అనూష ఆధ్వర్యంలో చలువ పందిల్లను ఏర్పాటుచేశారు. ఆలయా నికి రంగులను మాజీ సర్పంచ్ కొంజర్ల వెంకటయ్య సొంత ఖర్చులతో వేయించారు. కార్య దర్శి అనంతుల లచ్చయ్య, పాటకుల అనిల్, ఏదుల్ల కనుకయ్య, మానుమండ్ల శ్రీనివాస్, మెరుగు రమేష్, ఎండి అంకూస్ పాల్గొన్నారు.
సుల్తానాబాద్, (ఆంధ్ర జ్యోతి): సుల్తానాబాద్ పట్ట ణం మూడవ వార్డు ప్రజలు కౌన్సిలర్ కందునూరి సమత కుమార్ ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు నిర్వహించారు. అన్ని కులాలకు చెందిన వారు కుటుంబ సభ్యులతో కలసి ఉత్సవాలు జరుపుకున్నారు. భక్తిశ్రద్ధలతో బోనం తయారు చేసి తలపై పెట్టుకుని డప్పుచప్పుళ్ల మధ్య ఊరేగింపుగా పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. యేటా ఉగాది పండుగకు ముందు పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం ఆనవాయితీ అని కౌన్సిలర్ అన్నారు.