ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం ఇప్పించండి
ABN , Publish Date - May 11 , 2026 | 11:54 PM
స్కాలర్‌షిప్ మంజూరు కోసం కావా ల్సిన ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకు న్నా ఇవ్వడం లేదని సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి గ్రామానికి చెం దిన బి హన్సిక కలెక్టర్ కోయ శ్రీహర్షను కోరారు. సోమవారం కలెక్టరే ట్‌లో నిర్వహించిన ప్రజావాణి సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
పెద్దపల్లి, మే 11 (ఆంధ్రజ్యోతి): స్కాలర్‌షిప్ మంజూరు కోసం కావా ల్సిన ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకు న్నా ఇవ్వడం లేదని సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి గ్రామానికి చెం దిన బి హన్సిక కలెక్టర్ కోయ శ్రీహర్షను కోరారు. సోమవారం కలెక్టరే ట్‌లో నిర్వహించిన ప్రజావాణి సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. హన్సిక కుల ధ్రువీకరణ విషయం లో అవసరమైన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌కు కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. పెద్దపల్లి మండలం భోజన్నపేట గ్రామపంచాయతీకి చెం దిన ఆవుల వసంత ఇంటి నిర్మాణం కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసు కున్నా మంజూరు చేయడం లేదని పేర్కొనగా జిల్లా పంచాయతీకి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. రామగుం డం నగరపాలక సంస్థకు చెందిన లింగం వెంకట్‌రెడ్డి అయోధ్యనగర్ పరిధిలో ఆరు సంవత్సరాల క్రితం రేకులను తొలగించి స్లాబ్ ఇళ్లు నిర్మించినా పాత రేకుల ఇంటి పన్ను మాత్రమే చెల్లిస్తూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాడని దరఖాస్తు సమర్పించగా మున్సిపల్ కమిషనర్‌కు రాస్తూ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణి కార్యక్ర మంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.