Share News

క్రీడాకారులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

ABN , Publish Date - Feb 09 , 2026 | 12:10 AM

క్రీడాకారులందరూ మంచి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని, అప్పుడే క్రీడల్లో రాణించగలుగుతారని రామగుండం మండల విద్యాధికారి జింక మల్లేష్‌, వన్‌టౌన్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి అన్నారు.

క్రీడాకారులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

కోల్‌సిటీటౌన్‌, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): క్రీడాకారులందరూ మంచి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని, అప్పుడే క్రీడల్లో రాణించగలుగుతారని రామగుండం మండల విద్యాధికారి జింక మల్లేష్‌, వన్‌టౌన్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి అన్నారు. ఆదివారం గోదావరిఖని జవహర్‌లాల్‌ నెహ్రు స్టేడియంలో రామగుండం నియోజకవర్గ స్థాయి సీఎం క్రీడా పోటీలను వారు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక దారుఢ్యానికి దోహదపడతాయన్నారు. అంతేకాకుండా వివిధ రంగాల్లో ఉద్యోగాలు సాధించేందుకు ఉపకరిస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో భాగం సీఎం కప్పులో భాగంగా మొదట మండల స్థాయిలో రెండో దశలో నియోజకవర్గ స్థాయిలో మూడవ దశలో జిల్లాస్థాయిలో క్రీడలు జరుగుతాయని తెలిపారు. జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య కార్యదర్శి లక్ష్మణ్‌, సీఎం కప్‌ క్రీడల క్లస్టర్‌ ఇంచార్జీ శోభారాణి, అబ్జర్వర్‌ సాయిరాం, సోమశేఖర్‌, జావిద్‌, రమాదేవి, తిరుపతి, చంద్రశేఖర్‌, చందు, మౌనిక పాల్గొన్నారు.

Updated Date - Feb 09 , 2026 | 12:10 AM