Share News

మొక్కల రక్షణ అందరి భాధ్యత

ABN , Publish Date - Aug 26 , 2026 | 12:05 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా నాటిన మొక్కలను రక్షించే బాధ్యతను అందరూ తీసుకోవాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు.

మొక్కల రక్షణ అందరి భాధ్యత

పెద్దపల్లి రూరల్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా నాటిన మొక్కలను రక్షించే బాధ్యతను అందరూ తీసుకోవాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. మంగళవారం సబ్బితంలో వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాల్లో ఎక్కడ చూసినా పచ్చని వాతావరణం కనిపించాలని, ప్రతి ఇంట్లో పండ్ల, పూల మొక్కలు విరివిగా పెంచాలని సూచించారు. మొక్కలు ఎండిపోకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కాళిందిని, ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్‌, సర్పంచ్‌ నూనె సరోజనరమేష్‌, సర్పంచ్‌ల పోరం మండల అఽధ్యక్షుడు కనపర్తి సంపత్‌రావు, రంగాపూర్‌ సర్పంచ్‌ గంట రమేష్‌, ఏపిఎం శాంతితో పాటు ఫారెస్ట్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 26 , 2026 | 12:05 AM