Share News

రామగుండం కార్పొరేషన్‌లో పైపులు మాయం

ABN , Publish Date - Oct 25 , 2026 | 11:40 PM

రామగుండం నగరపాలక సంస్థకు చెందిన రూ.60లక్షల విలువైన పైపులు మాయమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు అయిన అమృత్‌ నిధులతో కొనుగోలు చేసిన డక్టిల్‌ ఐరన్‌(డీఐ) పైపులను గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లినట్టు తెలుస్తున్నది. కార్పొరేషన్‌ కార్యాలయ సమీ పంలో నిల్వ చేసిన ఈ పైపులు మాయం కావడం ఇప్పుడు దుమారం రేపుతుంది.

రామగుండం కార్పొరేషన్‌లో పైపులు మాయం

కోల్‌సిటీ, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): రామగుండం నగరపాలక సంస్థకు చెందిన రూ.60లక్షల విలువైన పైపులు మాయమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు అయిన అమృత్‌ నిధులతో కొనుగోలు చేసిన డక్టిల్‌ ఐరన్‌(డీఐ) పైపులను గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లినట్టు తెలుస్తున్నది. కార్పొరేషన్‌ కార్యాలయ సమీ పంలో నిల్వ చేసిన ఈ పైపులు మాయం కావడం ఇప్పుడు దుమారం రేపుతుంది.

అమృత్‌ నిధులతో గోదావరిఖని సీఎస్‌పీ కాలనీ, విఠల్‌నగర్‌, భీముని పట్నంలో ఓవర్‌హెడ్‌ ట్యాంకుల నిర్మాణంతోపాటు పంపింగ్‌ మెయిన్‌, డిస్ర్టిబ్యూషన్‌ లైన్ల నిర్మాణం జరిపారు. ఇందుకుగాను డీఐ పైపులను కొనుగోలు చేసి సదరు కాంట్రాక్టు సంస్థకు బిల్లులు కూడా చెల్లించారు. పంపింగ్‌ మెయిన్‌, డిస్ర్టిబ్యూషన్‌ లైన్లు వేయాల్సి ఉండగా సైట్‌ పరిస్థితి దృష్ట్యా వేయలేకపోయారు. ప్రజారోగ్యశాఖ ఈ స్కీమ్‌ను పూర్తి చేసి నగర పాలక సంస్థకు అప్పగించే సమయంలో పైపులను కూడా అప్పగించింది. భవిష్యత్‌లో పైప్‌లైన్ల మరమ్మతులు, కొత్త పైప్‌లైన్ల నిర్మాణానికి వీలుగా వీటిని అందుబాటులో ఉంచారు. కార్పొరేషన్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో అధికారులు బదిలీ కావడం, మరికొందరు పదవీ విరమణ చెందడంతో ఈ పైపులను మాయం చేసినట్టు తెలుస్తున్నది. ఇవి పూర్తిగా ఇంజనీరింగ్‌ విభాగం ఆధీనంలో ఉంటాయి. వీటి విలువ సుమారు రూ.60లక్షల పైగానేనని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇతర అవసరాలకు వినియోగించినా ఖచ్చితంగా ఇంజనీరింగ్‌ విభాగం నుంచి కార్పొరేషన్‌ కమిషనర్‌ అనుమతితో మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. కానీ వీరికి సమాచారం లేకుండానే పైపులు మాయమైనట్టు తెలుస్తుంది. గతంలో మంచినీటి సరఫరా విభాగంలో ఒక కాంట్రాక్టు ద్వారా తెప్పించిన పైపులను మరో కాంట్రాక్టర్‌ పనుల్లో వినియోగించడం, ఒకే పైపులను ఇద్దరికి బిల్లులు రాసిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఇప్పుడు ఏకంగా పైపులే మాయమైన ఘటన చోటు చేసుకున్నది. సుమారు నెల రోజుల క్రితమే ఈ పైపులు దారిమళ్లినట్టు చర్చ జరుగుతుంది. కొనుగోలు చేసినట్టు రికార్డుల్లో ఉండి కార్పొరేషన్‌ ఆధీనంలోని పైపులను తీసుకెళ్లే సాహసం ఎవరు చేశారనే చర్చ కూడా కార్పొరేషన్‌వర్గాల్లో ఉంది.

Updated Date - Oct 25 , 2026 | 11:40 PM