Share News

ఫూలే ఆశయాలను ఆచరించాలి

ABN , Publish Date - Apr 11 , 2026 | 11:55 PM

మహాత్మాజ్యోతిబా ఫూలే ఆశయాలు, ఆలోచనలను మనమంతా ఆచరించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జ్యోతిబాఫూలే జయంతి వేడుకల్లో అద నపు కలెక్టర్‌ వేణుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఫూలే ఆశయాలను ఆచరించాలి

పెద్దపల్లి కల్చరల్‌, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): మహాత్మాజ్యోతిబా ఫూలే ఆశయాలు, ఆలోచనలను మనమంతా ఆచరించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జ్యోతిబాఫూలే జయంతి వేడుకల్లో అద నపు కలెక్టర్‌ వేణుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ దేశం అభి వృద్ధి చెందాలంటే ఇలాంటి మహాత్ముల ఆశయాలు, ఆలోచనలు మనం ఆచరిస్తూ, ముందుతరాలకు అందించాలని కోరారు. సామాజిక సమా నత్వం సాధనకు జ్యోతిబాఫూలే చేసిన పోరాటం ఇప్పటి తరానికి గుర్తుకు వచ్చేలా చూడాలన్నారు.

సమాజంలోని అసమానతలు దూరమయ్యేం దుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. బాలికల విద్యపై ఫూలే దంప తులు చిత్తశుద్ధితో పని చేశారని, స్ర్తీలు విద్యావంతులు కావాలని ఆకాం క్షించారని పేర్కొన్నారు. అంతకుముందు పెద్దపల్లిలోని మహాత్మాజ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినులు చేసిన కూచిపూడి నృత్యం అందరిని అలరించింది. జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి, కలెక్టరేట్‌ పాలన అధికారి ప్రకాష్‌, పలు బీసీ సంఘా ల నాయకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2026 | 11:55 PM