Share News

అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి

ABN , Publish Date - Oct 27 , 2026 | 12:20 AM

ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అదనపు కలెక్టర్‌ శ్రీరాములతో కలిసి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.

అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి

పెద్దపల్లి, అక్టోబరు26(ఆంధ్రజ్యోతి): ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అదనపు కలెక్టర్‌ శ్రీరాములతో కలిసి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. సుల్తానాబాద్‌ మండలం చిన్నబొంకూరు గ్రామానికి చెందిన చింతల చుక్కమ్మ పేరు మీద ఉన్న ఇంటి ఖాళీ స్థలాన్ని ఆక్రమించుకొని దొంగ పట్టా చేయించుకోవడానికి చూస్తున్న గుజ్జుల నారాయణరెడ్డి పై చర్యలు తీసుకోవాలని దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్‌ సుల్తానాబాద్‌కు రాశారు. కాల్వశ్రీరాంపూర్‌ మండలం కూనారం గ్రామానికి చెందిన మామిడి రామ్‌కి గృహ జ్యోతి పథకం తన కుటుంబానికి మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకోగా ఎంపీడీవోకు రాస్తూ పరిశీలించి అర్హత ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఏవో ప్రకాష్‌ సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 27 , 2026 | 12:20 AM