Share News

అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి

ABN , Publish Date - Sep 28 , 2026 | 11:58 PM

ప్రజావాణి దరఖాస్తులను అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ బి.శ్రీరాములు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.

అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి

పెద్దపల్లి టౌన్‌, సెప్టెంబర్‌ 28 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి దరఖాస్తులను అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ బి.శ్రీరాములు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. రామగుండం కేసీఆర్‌ కాలనీకి చెందిన ఎం.డి. అహ్మదొద్దీన్‌ దివ్యాంగుడినని, బీకాం పూర్తి చేశానని, ఉద్యోగం ఇప్పించాలని కోరగా వారధి సొసైటీకి రాశారు. పెద్దపల్లి పట్టణానికి చెందిన అజిమా బేగం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు మంజూరు చేయాలని కోరగా పీడీ హౌసింగ్‌కు రాశారు. సుల్తానాబాద్‌ మండలం ఐతరాజుపల్లెకు చెందిన దాసరి రాజారెడ్డి సర్వే నంబర్లు 290, 291 లో 8 గుంటల భూమిని సాదాబైనామా ద్వారా కొనుగోలు చేశామని, పట్టా చేయాలని కోరగా రెవెన్యూ అధికారికి రాస్తూ చర్యలు తీసుకోవాలని తెలిపారు. పాలకుర్తి మండలానికి చెందిన మాదాసు అమృత తమ షెడ్డును తహసీల్దార్‌ కార్యాలయం కోసం వినియోగించుకున్నారని, కిరాయి, కరెంటు బిల్లులు విద్యుత్‌ బిల్లులు చెల్లించలేదని ఫిర్యాదు చేయగా తహసీల్దార్‌కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టరేట్‌ పరిపాలన అధికారి బి. ప్రకాష్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2026 | 11:58 PM