అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి
ABN , Publish Date - Jul 07 , 2026 | 12:10 AM
ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధా న్యతనిచ్చి పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.
పెద్దపల్లి, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధా న్యతనిచ్చి పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. కాల్వశ్రీరాంపూర్ మండలం మంగపేటకు చెందిన ఏ లక్ష్మి గ్రామంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్ట్ ఇప్పించాలని దరఖాస్తు చేసుకోగా వారధి సోసైటీకి రాశారు. ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన మహంకాళి వీరమ్మ, గొట్టె లింగమ్మ సర్వేనెంబర్ 294లో ప్రభుత్వం తర ఫున బోర్‌వెల్ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోగా ఈడీఎస్సీ కార్పొరేషన్‌కు రాస్తూ చర్యలు తీసుకోవాలన్నారు. మంథని పట్టణం రాఘవ ఊర్లనగర్‌కు చెందిన భీమనపల్లి సురేందర్ కుమార్తెకు బీసీ గురుకుల పాఠశాలలో 8వ తరగతి సీటు ఇప్పించాలని దరఖాస్తు చేసుకోగా గురుకుల పాఠశాల సొసైటీ అధికారులకు రాశారు. కలెక్టరేట్ పరిపాలన అధికారి బి.ప్రకాష్, అధికారులు, కలెక్టరేట్ డి.విభాగ పర్యవేక్షకులు ఈశ్వరప్రసాద్ ఉన్నారు.