Share News

మూడు చెరువుల్లో మట్టి తవ్వకాలకు అనుమతి

ABN , Publish Date - May 02 , 2026 | 11:32 PM

జిల్లాలోని మూడు చెరువుల్లో మట్టి తవ్వకాలకు అనుమతులు ఇచ్చామని, అక్రమ రవాణా జరగకుండా చర్య లు తీసుకోవాలని అధికారులను కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. శని వారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లా డారు.

మూడు చెరువుల్లో మట్టి తవ్వకాలకు అనుమతి

పెద్దపల్లి, మే 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మూడు చెరువుల్లో మట్టి తవ్వకాలకు అనుమతులు ఇచ్చామని, అక్రమ రవాణా జరగకుండా చర్య లు తీసుకోవాలని అధికారులను కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. శని వారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లా డారు. నీటిమట్టం తక్కువగా ఉన్న చెరువుల నుంచి మట్టి తవ్వకాలకు గతేడాది సెస్‌ వసూలు చేసి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. ఇదే విధానాన్ని ఈ సంవత్సరం కొనసాగిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం కొదురుపాక చెరువు, రాయకుంట చెరువు, ముత్తారం చెరువుల నుంచి మట్టి రవాణాకు 15 ఇటుక బట్టీలు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఈ మూడు చెరు వులకు మాత్రమే అనుమతులు ఇస్తామన్నారు.

అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్‌ఓసీలు ఇవ్వాలని ఆదేశించారు. మట్టి రవాణాపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్‌ సూచించారు. ప్రతీ వాహన రవాణాను ఫొటోగ్రఫీ చేయాలని, రసీదు జారీ చేయాలని తెలిపారు. వాహనాలు అధిక లోడుతో రవాణా చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ మట్టి, ఇసుక తవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మానేరువాగు పరిధిలో పెద్దపల్లి వైపు ఎలాంటి ఇసుక తవ్వకాలకు అనుమతులు లేవని, కరీంనగర్‌ వైపు జరుగుతున్న తవ్వకాల నేపథ్యంలో ఎక్స్‌కవేటర్లు పెద్దపల్లి వైపు రాకుండా కఠినంగా వ్యవహరిం చాలన్నారు. ఈ విషయమై ఎక్స్‌కవేటర్‌ యజమానులతో సమావేశం నిర్వ హించి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని అధికారులకు సూచించారు. గనుల శాఖ అధికారి శ్రీనివాస్‌, ఆర్డీఓలు సురేష్‌, గంగయ్య పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2026 | 11:32 PM