Share News

ఖాదీ గ్రామీణ పరిశ్రమలను ప్రజలు వినియోగించుకోవాలి

ABN , Publish Date - Nov 20 , 2026 | 11:26 PM

ఖాదీ గ్రామీణ పరిశ్రమల ద్వారా సూక్ష్మ, లఘు, మధ్యంతర పరిశ్రమల ఏర్పాటుకు గ్రామీణ ప్రాంత యువతీ, యువకులు ముందుకు వస్తే సబ్సిడీతోపాటు రుణ సౌకర్యాలను ఇచ్చి స్వయం ఉపాధికి కృషి చేస్తామని కేవీఐసీ కో-ఆర్డినేటర్‌ సంజీవరావు అన్నారు. సూరయ్యపల్లిలో జిల్లా స్థాయిలో కుమ్మర వృత్తిపై కేవీఐసీ ఆధ్వర్యంలో పది రోజుల క్రితం ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరం శుక్రవారం జరిగిన ముగింపు సమావేశంలో పాల్గొన్నారు.

ఖాదీ గ్రామీణ పరిశ్రమలను ప్రజలు వినియోగించుకోవాలి

మంథని, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఖాదీ గ్రామీణ పరిశ్రమల ద్వారా సూక్ష్మ, లఘు, మధ్యంతర పరిశ్రమల ఏర్పాటుకు గ్రామీణ ప్రాంత యువతీ, యువకులు ముందుకు వస్తే సబ్సిడీతోపాటు రుణ సౌకర్యాలను ఇచ్చి స్వయం ఉపాధికి కృషి చేస్తామని కేవీఐసీ కో-ఆర్డినేటర్‌ సంజీవరావు అన్నారు. సూరయ్యపల్లిలో జిల్లా స్థాయిలో కుమ్మర వృత్తిపై కేవీఐసీ ఆధ్వర్యంలో పది రోజుల క్రితం ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరం శుక్రవారం జరిగిన ముగింపు సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఖాదీ గ్రామీణ పరిశ్రమల ద్వారా వివిధ వృత్తులకు సబ్సిడీతో రుణ సౌకర్యాలను ఇచ్చి స్వయం ఉపాధికి కృషి చేస్తున్నామని, ఈ అవకాశాల్ని ప్రజలు వినియోగించుకోవాలన్నారు. శిక్షణ పొందిన యువతి యువకులు మంచి నైపుణ్యంతో కుల వృత్తితో చేసే మట్టి పాత్రలను వినియోగించుకొని వివిధ వ్యాధుల నుండి కాపాడుకోవాలన్నారు. ప్లాస్టిక్‌ అల్యూమినియం పాత్రలతో పలు వ్యాధుల బారిన ప్రజలు పడుతున్నందున మట్టి పాత్రలను ఉపయోగించి వ్యాధుల నివారణకు ప్రజలు కృషి చేయాలన్నారు. కుమ్మర సంఘం రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు టీకే.శ్రీనివాస్‌, జిల్లా అధ్యక్షడు ఆషాడపు లింగయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కటికనపల్లి రవీందర్‌, సూరయ్యపల్లి సర్పంచ్‌ ఆర్ల నాగరాజు, పంచాయతీ కార్యదర్శి రేణుక, పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2026 | 11:26 PM