అవయవ దానంపై ప్రజలు చైతన్యవంతం కావాలి
ABN , Publish Date - Aug 14 , 2026 | 12:03 AM
నేత్రదానం, అవయవాల దానం కోసం ప్రజలు చైతన్యవంతులు కావాలని తహసీల్దార్ వనజ కోరారు. ప్రపంచ అవయవదాన దినోత్సవంలో భాగంగా గురువారం కస్తూర్బా కళాశాలలో సదాశివ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు.
ఓదెల, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : నేత్రదానం, అవయవాల దానం కోసం ప్రజలు చైతన్యవంతులు కావాలని తహసీల్దార్ వనజ కోరారు. ప్రపంచ అవయవదాన దినోత్సవంలో భాగంగా గురువారం కస్తూర్బా కళాశాలలో సదాశివ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. తహసీల్దార్ వనజ, ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి భీష్మా చారి మాట్లాడుతూ సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2008 నుంచి ఇప్పటివరకు 1640 నేత్రదానాలు, 160 శరీర దానాలు, 95 అవయవ దానాలు చేశామని తెలిపారు. ఓదెల, అబ్బిడిపల్లి గ్రామస్తులు తమ మరణానంతరం నేత్రదానం చేస్తామని సర్పంచ్ ఆధ్వర్యంలో తీర్మానాలు చేశారని పేర్కొన్నారు. విద్యార్థులకు నేత్ర శరీర దానాలపై అవగాహన కల్పించారు. మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, ప్రిన్సిపాల్ జ్యోతి, ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు,క్యాతం మల్లేశం పాల్గొన్నారు.