Share News

విద్యాశాఖలో పెండింగ్‌ పనులు పూర్తి చేయాలి

ABN , Publish Date - Oct 07 , 2026 | 11:35 PM

విద్యాశాఖలో పెండింగ్‌లో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. బుధవా రం విద్యాశాఖ పనితీరుపై అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు.

విద్యాశాఖలో పెండింగ్‌ పనులు పూర్తి చేయాలి

పెద్దపల్లి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): విద్యాశాఖలో పెండింగ్‌లో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. బుధవా రం విద్యాశాఖ పనితీరుపై అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. విద్యా భ్యాస కార్యక్రమాల అమలు, విద్యార్థుల అభ్యసన స్థాయి, ఎఫ్‌ఎల్‌ఎన్‌ అమలు, పదో తరగతి ఫలితాలు, పాఠశాలల పరిశు భ్రత, అభివృద్ధి, మధ్యాహ్న భోజనం, అల్పా హారం అంశాలపై సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రతీ మండలం లోని పాఠశాలల్లో విద్యాభ్యాస కార్యక్రమాలకు సంబం ధించిన అన్ని పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేలా మండల విద్యాశాఖ అధికారులు చొరవ చూపాలని కలెక్టర్‌ సూచించారు. ప్రతీ అంశాన్ని క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ, పెండింగ్‌ పనులను గుర్తించి వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతీ విద్యార్థికి కనీసం చదవడం, రాయడం, ప్రాథమిక గణిత నైపుణ్యా లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ తెలిపారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ వహిం చాలని సూచించారు. విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరిచేందుకు ఉత్తమ బోధనా పద్ధతులను పాటిం చాలని తెలిపారు. పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సూచించారు. ప్రతీ విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం, అల్పాహారం నాణ్యతగా ఉండేలా చూడాలన్నారు. అధికారులు, పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2026 | 11:35 PM