పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలి
ABN , Publish Date - Jul 14 , 2026 | 12:03 AM
పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించి నింది తులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా అధి కారులను హెచ్చరించారు. సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో అర్థవార్షిక నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
కోల్‌సిటీ, జూలై 13(ఆంధ్రజ్యోతి): పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించి నింది తులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా అధి కారులను హెచ్చరించారు. సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో అర్థవార్షిక నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కమిషనరేట్ పరిధిలో కేసుల దర్యాప్తుపై సంబం ధిత పోలీస్ అధికారులు తీసుకుంటున్న చర్యలపై స్టేషన్ అధికారులను తెలుసుకోవ డంతో పాటు పెండింగ్ కేసుల పురోగతిపై సూచనలు, సలహాలు జారీచేశారు. సీసీటీఎన్‌ఎస్ 2.0పరిధిలో నమోదైన కేసుల దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని, డిజిటల్ రికార్డులను నిరంతరం నవీకరించాలని, ఎస్‌హెచ్‌ఓలు కేసులకు సంబంధించిన ప్రతీ అంశాన్ని నిర్ణీత సమయంలో సిస్టంలో నమోదు చేయాలని, ఎఫ్‌ఐఆర్ నుంచి చార్జిషీట్లు వేసే వరకు అన్నీ అంశాలపై జాగ్రత్తలు వహించాలన్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతీ ఒక్కరితో గౌరవంగా మాట్లాడాలన్నారు. ప్రతి ఫిర్యాదులో పారదర్శకంగా విచారణ చేసి సాక్షులను రికార్డు చేసి సమగ్ర రిపోర్టు ఇవ్వాలన్నారు. పోలీస్‌స్టేషన్‌కు ఎవరిని అనవసరంగా పిలువ రాదని, అరెస్టుల విషయంలో ఎస్‌ఓపీని కచ్చితంగా పాటించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యానికి తావివ్వద్దని, నిర్లక్ష్యం వహించే వారిపై వేటు తప్పదని హెచ్చ రించారు. డీసీపీలు రాంరెడ్డి, భాస్కర్, డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీలు రమేష్, గజ్జి కృష్ణ, ఆర్ ప్రకాష్, వెంకటేశ్వర్లు, కిరణ్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేందర్‌గౌడ్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌ల సీఐలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌హెచ్‌ఓలు పాల్గొన్నారు.