Share News

బీఆర్‌ఎస్‌ పాలనలో నిరక్ష్యానికి గురైన పెద్దపల్లి

ABN , Publish Date - May 09 , 2026 | 11:37 PM

బీఆర్‌ఎస్‌ పాలనలో పెద్దపల్లి నియో జకవర్గం అభివృద్ధిలో తీవ్ర నిరక్ష్యానికి గురైందని, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి, మం త్రుల సహకారంతో రెండేళ్లలో కోట్లాది రూపాయలతో దశల వారీగా అభివృద్ధి పనులు చేస్తున్నామని ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు.

బీఆర్‌ఎస్‌ పాలనలో నిరక్ష్యానికి గురైన పెద్దపల్లి

పెద్దపల్లి, మే 9 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ పాలనలో పెద్దపల్లి నియో జకవర్గం అభివృద్ధిలో తీవ్ర నిరక్ష్యానికి గురైందని, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి, మం త్రుల సహకారంతో రెండేళ్లలో కోట్లాది రూపాయలతో దశల వారీగా అభివృద్ధి పనులు చేస్తున్నామని ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. శనివారం పెద్దకలువల వద్ద స్థానిక నాయకులు, అధికారులతో కలిసి బైపాస్‌ రోడ్డు నిర్మా ణానికి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నియోజకవర్గానికి రూ.82 కోట్లతో బైపాస్‌ రోడ్డు మంజూరు చేయడం శుభసూచకమన్నారు. పెద్దపల్లి బస్సు డిపో, జిల్లా కోర్టు భవనం, డబుల్‌ లైన్‌ రోడ్ల నిర్మాణాలు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆధునికీకరణ, మినీ ట్యాంక్‌ బండ్‌ నిర్మాణాలు, బ్యాడ్మింటన్‌ కోర్టు లు, నూతన వాటర్‌ ట్యాంకుల నిర్మా ణాలు, సెంట్రల్‌ లైటింగ్‌, ఆల యాల అభివృద్ధి తదితర పనులు చేపడుతు న్నామని తెలిపారు. సుల్తానాబాద్‌, పెద్దపల్లి పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. అమృత్‌ పథ కం ద్వారా మంచి నీటి ట్యాంకులను నిర్మిస్తూ ప్రజల అవసరాలను తీరుస్తు న్నామని గుర్తు చేశారు. పెద్దపల్లి మండలం పెద్దకల్వల నుంచి నిట్టూరు, చందపల్లి మీదుగా అప్పన్న పేట వరకు 12 కిలోమీటర్ల మేరకు డబుల్‌ లైన్‌ రోడ్డుతో పాటు సెంట్రల్‌ లైటింగ్‌ తో కూడిన బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి పనులు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. పార్టీలకు అతీతంగా బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి ప్రజలం దరూ సహకరిస్తూ అభివృద్ధిలో అం దరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. జిల్లా రోడ్లు భవనాల శాఖ ఎస్‌ఈ భావుసింగ్‌, ఆర్డీవో గంగ య్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతటి అన్నయ్యగౌడ్‌, పెద్దపల్లి, సుల్తా నాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్లు నూగిళ్ల మల్లయ్య, బిరుదు రాధాకృష్ణ మున్సిప ల్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు గాజుల రాయ మల్లు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్లు మినుపాల ప్రకాష్‌ రావు, మల్లారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ నాయ కులు గోపగాని సారయ్య గౌడ్‌, పెద్దక ల్వల, పెద్దబొంకూర్‌ సర్పంచులు కనకమ్మ, కల్వల తిరుపతి, సర్పంచులు, ప్రజాప్ర తినిధులు, నాయకులు, పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2026 | 11:37 PM