ప్రశాంతంగా నీట్ పీజీ
ABN , Publish Date - Aug 30 , 2026 | 11:32 PM
జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్ పీజీ 2026 ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో మొత్తం 230 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 227 మంది హాజరు కావ డంతో 98.69 శాతం నమోదైంది.
పెద్దపల్లి/రామగిరి, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్ పీజీ 2026 ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో మొత్తం 230 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 227 మంది హాజరు కావ డంతో 98.69 శాతం నమోదైంది. ముగ్గురు విద్యార్థులు గైర్హజరయ్యారు. పరీక్ష నిర్వ హణకు జిల్లాలోని మూడు కళాశాలల్లో మూడు కేం ద్రాలను ఏర్పాటు చేశారు. పెద్దపల్లి ట్రినిటి కళాశాలలో 60 మందికి అందరూ, మదర్‌థెరిస్సా కళాశాలలో 70 మందికి 69 మంది, రామగిరి మండలం సెంటినరీ కాలనీ జేఎన్టీయూలో 100 మందికి 98 మంది హాజ రయ్యారు.
మండలంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో నీట్ పీజీ ప్రవేశ పరీక్ష పకడ్బందీగా నిర్వహించారు. పోలీసుల పహరా మధ్య విద్యార్థులను తనిఖీలు నిర్వ హించి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్ష కేం ద్రానికి ఎవరు ఆలస్యంగా రాలేదని ప్రిన్సిపాల్ విష్ణువ ర్ధన్ తెలిపారు. డీసీపీ భూక్యా రాంరెడ్డి, గోదావరిఖని ఏసీపీ మడత రమేశ్, ఎస్‌బి ఏసీపీ నాగేందర్, మంథని సీఐ బుద్దెస్వామి, తహసీల్దార్ సుమన్, ఇరువురు పరిశీలకులు, ఫ్లయింగ్ స్క్వాడ్‌ల పర్యవేక్షణలో పరీక్ష సజావుగా సాగింది.