రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలి
ABN , Publish Date - Apr 10 , 2026 | 11:42 PM
రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని, దేవుడు జన్మనిస్తే, డాక్టర్లు ప్రాణాలు కాపాడి పునర్జన్మనిస్తారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం నంది మేడారంలో నిర్మించిన 30 పడకల ఆసుపత్రిని కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రారంభించారు.
ధర్మారం, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని, దేవుడు జన్మనిస్తే, డాక్టర్లు ప్రాణాలు కాపాడి పునర్జన్మనిస్తారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం నంది మేడారంలో నిర్మించిన 30 పడకల ఆసుపత్రిని కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రారంభించారు. గ్రామంలో ఆసుపత్రి నిర్మాణానికి 1968 లోనే పొనుగోటి మురళీధర్‌రావు రూపకల్పన చేశారని, ఆయన ఆలోచణ గొప్పదని సంతో షం వ్యక్తం చేశారు. ఆయన ఆశయాల మేరకు కుటుంబ సభ్యులు ఆసుపత్రి నిర్మా ణానికి భూమిని దానం చేయడం హర్షిం చదగ్గ విషయమన్నారు. ఆసుపత్రికి కావ ల్సిన అన్ని రకాల సామగ్రిని వెంటనే సమకూర్చాలని అధికారులను మంత్రి ఆదే శించారు. మేడారం గ్రామాన్ని ఇప్పటికే వం దల కోట్లతో అభివృద్ధి చేశామని, మిగిలిన పనులను పూర్తిచేయుటకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. మేడారం గ్రామంలో కమ్యునిటీ హెల్త్ సెంటర్ ఏర్పా టు చేయడం మండల ప్రజలకు ఉపయో గకరమని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య పరికరాలు, సరిపడా మందులు అందు బాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటు న్నామని పేర్కొన్నారు. తమ తండ్రి మురళీ ధర్‌రావు ఆలోచన మేరకే నడుచుకుంటు న్నామని ఆయన కుమారుడు నర్సింగరావు తెలిపారు. గ్రామంలో ఆసుపత్రితోపాటు పాఠశాల భవనాలకు భూములు ఇచ్చామని పేర్కొన్నారు. మేడారంలోనే కోర్టు భవనం నిర్మించేలా మంత్రి అడ్లూరి సహాయ సహ కారాలు అందించాలని ఏఎంసీ వైస్ చైర్మన్ అరిగె లింగయ్య కోరారు. సర్పంచ్ వీర్‌పాల్, ఏఎంసీ చైర్మన్ రూప్లాపాయక్, జిల్లా వైద్యా ధికారి పవన్‌కుమార్, డిస్ట్రిక్ట్ కోపరేటీవ్ హెల్త్ సూపరింటెండెంట్ శ్రీధర్, అన్ని గ్రామాల సర్పంచులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.