బస్సుల కోసం ప్రయాణికుల పాట్లు
ABN , Publish Date - Oct 25 , 2026 | 11:43 PM
గోదావరిఖని బస్టాండ్ ఆదివారం ప్రయాణికులతో కిటకిటలాడింది. దసరా పండుగకు వచ్చిన వారు తిరిగి వెళుతుండడంతో మూడు రోజులుగా గోదావరిఖని ఆర్‌టీసీ బస్టాండ్ ప్రయాణీకులతో కిక్కిరిసింది.
కళ్యాణ్‌నగర్, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): గోదావరిఖని బస్టాండ్ ఆదివారం ప్రయాణికులతో కిటకిటలాడింది. దసరా పండుగకు వచ్చిన వారు తిరిగి వెళుతుండడంతో మూడు రోజులుగా గోదావరిఖని ఆర్‌టీసీ బస్టాండ్ ప్రయాణీకులతో కిక్కిరిసింది. బస్సుల కోసం ప్రయాణికులు పరుగులు తీయడం, సీట్ల కోసం కుస్తీ పడుతున్నారు. ఫ్లాట్‌ఫాంలన్నీ ప్రయాణీకులతో నిండిపోయి కనిపించాయి. ఆదివారం ఉదయం 4 గం టల నుంచే విద్యార్థులు, ప్రయాణీకులు తిరుగు ప్రయాణం కావడంతో బస్టాండ్‌లో బస్సుల కోసం వేచిచూసే పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం వంటి ప్రాంతాలకు ఎక్స్‌ప్రెస్ బస్సులను స్పెషల్ పేరుతో అదనపు చార్జీలను ఆర్‌టీసీ వసూలు చేసింది. ప్రయా ణికుల్లో ఎక్కువ మంది మహిళలే కనిపించడం, ఉచిత బస్సు కోసం గంటల తరబడి వేచి చూశారు. కొన్ని ఆర్డినరి పల్లె బస్సుల కూడా స్పెషల్ పేరుతో డబ్బులు వసూలు చేశారు. సూపర్ లగ్జరీ, డీలాక్స్, మెట్రో బస్సుల్లో సీట్లకు మించి ప్రయాణికులు గమ్యస్థానాలకు ప్రయా ణించారు. మరో రెండు రోజులు కూడా బస్సులన్నీ రిజర్వేషన్ అయ్యాయని గోదావరిఖని ఆర్‌టీసీ డిపో మేనేజర్ కవిత తెలిపారు.