Share News

యువతలో మార్పునకు తల్లిదండ్రులు కృషి చేయాలి

ABN , Publish Date - Jul 12 , 2026 | 11:45 PM

యువతలో మార్పు రావాలంటే తల్లిదండ్రుల కృషి అవసరమని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి నాయక్‌ అన్నారు. ఆదివారం రాత్రి కొత్తపల్లిలో ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వ ర్యంలో నిర్వహించిన గంజాయి - మత్తు పదార్ధాల నియంత్రణపై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.

యువతలో మార్పునకు తల్లిదండ్రులు కృషి చేయాలి

ధర్మారం, జూలై 12 (ఆంధ్రజ్యోతి): యువతలో మార్పు రావాలంటే తల్లిదండ్రుల కృషి అవసరమని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి నాయక్‌ అన్నారు. ఆదివారం రాత్రి కొత్తపల్లిలో ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వ ర్యంలో నిర్వహించిన గంజాయి - మత్తు పదార్ధాల నియంత్రణపై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. యువకులు చిన్న చిన్న తప్పిదాలతో జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. ప్రతి విద్యార్థి 25 సంవత్సరాలు కష్టపడి చదివితే 75 సంవత్సరాలు సుఖంగా జీవించవచ్చని, అదే 25 సంవత్సరాలు ఎంజాయ్‌ చేస్తే మిగితా 75 సంవత్సరాలు కష్టపడాల్సి వస్తుందని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువుతో పాటు వారి బాగోగులు చూసుకోవాలని, వారిని నిత్యం గమనించాలని కోరారు. మత్తు పదార్థాలు, సైబర్‌ క్రైం, రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజల కోరిక మేరకు డీసీపీ లంబాడి బాషలో మాట్లాడగా ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. లంబాడీలు కష్టపడి చదివి జీవితంలో ఉన్నతంగా ఎదగాలని బం జారాల ప్రవచనలకర్త ఎస్‌పీ నాయక్‌ అన్నారు. సిరిసిల్లా జిల్లాలోని ఓ తండాలో ఇంటికి నలుగురు ఉద్యోగస్తులు ఉన్నారని, చదువును కష్టంతో కాకుండా ఇష్టంతో చదవవాలని సూచించారు. సెల్‌ఫోన్‌ వల్ల కలిగే నష్టాలు, మత్తు పదార్థాల వల్ల జరిగే అనార్థాలను, సైబర్‌ క్రైం మోసాలను ఎస్‌పీ నాయక్‌ తన పాటలతో వివరించిన తీరు అందరిని ఆకర్షించింది. మండలంలో ఇప్పటికే గిరిజనులు ఎక్కువగా ఉన్న నాలుగు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, వాటి ద్వార సత్ఫలితాలు వస్తున్నాయని ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. ఏఎంసీ చైర్మెన్‌ రూప్లానాయక్‌, సర్పంచ్‌ రాజ్‌నాయక్‌, కాంగ్రెస్‌ పార్టీ డీసీసీ జనరల్‌ సెక్రెటరీ గాగిరెడ్డి తిరుపతి రెడ్డి, బొమ్మరెడ్డిపల్లి సర్పంచ్‌ ధార రాజు కటికెనపల్లి సర్పంచ్‌ లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 12 , 2026 | 11:45 PM