తల్లిదండ్రులు దేవుళ్లతో సమానం
ABN , Publish Date - Jun 15 , 2026 | 11:29 PM
తల్లిదండ్రులను దేవుళ్లతో సమానంగా చూస్తుకోవాలని, మనం ఉన్నతస్థాయికి చేరుకోవడానికి వారే కారణమని జిల్లా న్యాయమూర్తి సునిత కుంచాల అన్నారు. సోమవారం రాఘవపూర్‌లోని వృద్ధాశ్రమంలో ప్రపంచ వృద్ధుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
పెద్దపల్లి రూరల్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): తల్లిదండ్రులను దేవుళ్లతో సమానంగా చూస్తుకోవాలని, మనం ఉన్నతస్థాయికి చేరుకోవడానికి వారే కారణమని జిల్లా న్యాయమూర్తి సునిత కుంచాల అన్నారు. సోమవారం రాఘవపూర్‌లోని వృద్ధాశ్రమంలో ప్రపంచ వృద్ధుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సదస్సుకు జిల్లా న్యాయమూర్తి సునిత కుంచాల హాజరై ఆశ్రమంలోని వసతులు, వృద్ధు లకు అందిస్తున్న సదుపాయాలను తెలుసుకొన్నారు. వృద్ధులను అప్యా యంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ పిల్లలు తమ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని, వారిని ఆశ్రమాలకు పంపించకుండా పోషించాలన్నారు. తల్లిదండ్రులను పట్టించుకోకపోవడంతో ఆశ్రమాలు పెరిగిపోతున్నాయన్నారు. ఆస్తులను పిల్లలకు రాసిన అనంతరం వారు పోషించకుండా ఆశ్రమాల్లో వేస్తే వారి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చని సూచించారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. న్యాయవాదులు సి.సత్యనారాయణరెడ్డి, అశోక్ రెడ్డి, మహిపాల్‌రెడ్డి, తహసీల్దార్ రాజయ్య, పెద్దపల్లి రూరల్ ఎస్‌ఐ శ్వేత, సర్పంచ్ తాడిశెట్టి చామంతిశ్రీకాంత్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు.