కేసీఆర్ సీఎం కావాలని పాదయాత్ర
ABN , Publish Date - Sep 28 , 2026 | 11:56 PM
రాష్ట్రంలో కొనసాగుతున్న నియంతపాలన పోవాలని, సీఎంగా కేసీఆర్ మళ్ళీ రావాలని, మంథనిలో పుట్ట మధు ఎమ్మెల్యే గెలుపొందేలా ప్రజలు ఆశీర్వదించాలని భూపాల పల్లి మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ శ్రీహర్షిని, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్‌సింగ్‌లు అన్నారు.
మంథని, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొనసాగుతున్న నియంతపాలన పోవాలని, సీఎంగా కేసీఆర్ మళ్ళీ రావాలని, మంథనిలో పుట్ట మధు ఎమ్మెల్యే గెలుపొందేలా ప్రజలు ఆశీర్వదించాలని భూపాల పల్లి మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ శ్రీహర్షిని, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్‌సింగ్‌లు అన్నారు. మంథని గంగాపురికి చెందిన బూర్ల వెంకటేష్, బెన్నిపాల్, కొండ వెంకటేష్‌లు మంథని నుంచి ఎర్రవెల్లి కేసీఆర్ ఫాం హౌజ్ చేపట్టిన పాదయాత్రను అంబేద్కర్ చౌక్‌లో జెండా ఊపి ప్రారం భించారు. ఆమె మాట్లాడుతూ.. అధికారంలోకి రావటానికి అనేక హామీలు ఇచ్చిన రేవంత్‌రెడ్డి సర్కార్ ప్రజలను మోసం చేశారన్నారు. దోపిడి, నియంత పాలన కొనసాగిస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్న కాం గ్రెస్ సర్కార్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పాలన్నారు. బీఆర్‌ఎస్ నేతలు జక్కు రాకేష్, మాచీడి రాజుగౌడ్, గొబ్బూరి వంశీ, కనవేన శ్రీనివాస్, వేల్పుల గట్టయ్య, పుప్పాల తిరుపతి, కుమార్, యాకూబ్, జావీద్, ఖలీల్, బాలయ్య, కనుకయ్య పాల్గొన్నారు.