రైతుల కృషి వల్లే పీఎసీఎస్‌లు బలోపేతం
ABN , Publish Date - Mar 28 , 2026 | 11:26 PM
రైతులు అందించే తోడ్పాటు వల్లనే ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘాలు బలోపేతం అయ్యాయని ధూళికట్ట పీఎసీఎస్ పర్సన్ ఇన్‌చార్జి హైమద్ అలీ అన్నారు. శనివారం రైతువేదికలో ధూళికట్ట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సమావేశంలో ముఖ్యఅతిథిగా మాట్లా డారు.
ఎలిగేడు, మార్చి28(ఆంధ్రజ్యోతి): రైతులు అందించే తోడ్పాటు వల్లనే ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘాలు బలోపేతం అయ్యాయని ధూళికట్ట పీఎసీఎస్ పర్సన్ ఇన్‌చార్జి హైమద్ అలీ అన్నారు. శనివారం రైతువేదికలో ధూళికట్ట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 111వ సమావేశంలో ముఖ్యఅతిథిగా మాట్లా డారు. ఆర్థికంగా చితికిపోయిన రైతులను ఆదుకుని వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సహకార సంఘాల వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. సంఘం పరిధిలో 2543 మంది సభ్యులను కలిగి ఉంద న్నారు. 2024-25లో రూ.86,80,639 నికర లాభం వచ్చిం దని, ఏ గ్రేడుగా గుర్తింపు పొంది కొనసాగడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సంఘం పరిధిలో ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులు అందిస్తూ, వాటర్ ప్లాంట్‌లు నెలకొల్పి వ్యాపార రంగంలో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. రైతులు తోడ్పాటు మరువ లేనిదన్నారు. కార్యదర్శి బద్దం రవీందర్ రెడ్డి, సర్పంచ్ మారం కొమురయ్య, మానిటరింగ్ అధికారులు స్రవంతి, కిరణ్, ఓదెలు, సంజీవ్, రైతులు పాల్గొన్నారు.
జూలపల్లి, (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల రైతులకు ప్రభుత్వం పలు పథకా లతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పర్సన్ ఇన్‌చార్జి ఎన్ వెంకటేశ్వర్లు అన్నారు. ప్రాథ మిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో శనివారం మహాజన సభ సమావేశం నిర్వహించారు. 2024-25 అలాగే 2025-2026 సంవత్సరంలో ఆదాయ వ్యయాలను చదివి వినిపించారు. 5వేల మెట్రిక్ టన్నుల గోదాముల సముదాయంలో వాటా పొందుటకు పలు తీర్మానాలు ఆమోదించారు. మార్కెట్ కమిటీ వైస్‌చైర్మెన్ కొమ్మ పోచాలు, మానిటరింగ్ అదికారి స్రవంతి, ఉపసర్పంచ్ కొప్పుల మహేష్, సిఈఓ సురేష్, గంగిపెల్లి సుక్కయ్య పలువురు రైతులు పాల్గొన్నారు.