కిక్కిరిసిన బస్సులు.. ప్రయాణికుల పాట్లు
ABN , Publish Date - Oct 22 , 2026 | 11:37 PM
దసరా పండుగ ముగియడంతో సొంత ప్రాం తాలకు వెళ్లేవారు, వివిధ పనులపై హైదరా బాద్, కరీంనగర్, వరంగల్ వంటి నగరాలకు వెళ్లే వారితో గురువారం గోదావరిఖని బస్టాండ్ కిటకిటలాడింది.
కళ్యాణ్‌నగర్, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): దసరా పండుగ ముగియడంతో సొంత ప్రాం తాలకు వెళ్లేవారు, వివిధ పనులపై హైదరా బాద్, కరీంనగర్, వరంగల్ వంటి నగరాలకు వెళ్లే వారితో గురువారం గోదావరిఖని బస్టాండ్ కిటకిటలాడింది. పండుగకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గురువారం తెల్లవారు జాము నుంచి రాత్రి వరకు గోదావరిఖని ఆర్‌టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిట లాడింది. వివిధ రూట్లలో బస్సులు లేక ప్రయా ణికులు ఇబ్బందులు పడగా, వచ్చిన బస్సుల్లో సీట్ల కోసం పిల్లాపాపలతో పరుగులు తీశారు. భూపాలపల్లి, వరంగల్, కరీంనగర్, మంథని, ధర్మారం, ఓడేడ్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, నిజా మాబాద్, జగిత్యాల వంటి ప్రాంతాలకు వెళ్లే వారు బస్సులు లేకపోవడంతో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలా మంది ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. ఇదే అదనుగా భావించి రెట్టింపు చార్జిలను ప్రయాణికుల నుంచి వసూలు చేశారు.
ప్రత్యేక బస్సుల పేరుతో అధిక వసూలు
పండుగల సమయంలో ఆర్‌టీసీ ప్రయాణి కుల నుంచి ప్రత్యేక బస్సుల పేరుతో దోపిడీకి గురి చేస్తుంది. మహాలక్ష్మి పథకం కింద బస్సు లను తగ్గించి సూపర్ లగ్జరీ, డిలాక్స్ బస్సులను ప్రత్యేకంగా చార్జిలను వసూలు చేశారు. హైదరాబాద్, కరీంనగర్ వంటి ప్రాంతాలకు టికెట్‌పై అదనంగా వసూలు చేసి ప్రయా ణికుల జేబులను గుల్ల చేశారు. ప్రత్యేక బస్సుల పేరుతో కొన్ని ఆర్డినరీ సర్వీసులను కూడా వివిధ రూట్లలో నడిపి వసూలు చేసింది. ప్రత్యేక బస్సుల పేరుతో అదనంగా చార్జీలు వసూలు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగల సమయంలో ఇలా ఆర్‌టీసీ దోపిడీకి గురి చేయడంపై ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.