విజృంభిస్తున్న విష జ్వరాలు
ABN , Publish Date - Aug 18 , 2026 | 12:14 AM
వాతావరణంలో మార్పులు సంభించడం, మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. సోమవారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రోగుల తాకిడి పెరిగింది.
కళ్యాణ్‌నగర్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): వాతావరణంలో మార్పులు సంభించడం, మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. సోమవారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రోగుల తాకిడి పెరిగింది. సోమవారం 1500 ఓపీ నమోదు కాగా అందులో ఎక్కువ శాతం విష జ్వరాలు మలేరియా, టైఫాయిడ్, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వంటి సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరుతున్నారు. అత్యవసర విభాగంలో గడిచిన 24గంటల్లో వంద మంది చేరగా జనరల్ మెడిసిన్ 400, పల్మలాజీ 30, స్కిన్ 140, పిడియాట్రిక్ 160కేసులు నమోదు కాగా మిగిలిన కేసులు ఇతర విభాగాల్లో నమోదు అయ్యాయి. వారం రోజులుగా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వైద్యం కోసం పెద్ద ఎత్తున రోగులు తరలివస్తున్నారు. ఓపీ విభాగాలు, మందుల వద్ద రోగులు భారీగా క్యూ కడుతున్నారు. పలు ప్రాంతాల నుంచి రోగులు వైద్య చికిత్స కోసం వస్తున్నారు. దీంతో జీజీహెచ్‌లోని ఎమర్జెన్సీ బిల్డింగ్, పాత బిల్డింగ్‌లోని వార్డులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. వారం రోజులుగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రోగులు వైద్య కోసం భారీగా తరలివస్తున్నారు.