Share News

మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది

ABN , Publish Date - Apr 07 , 2026 | 11:49 PM

మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ కె.ప్రమోద్‌కుమార్‌ పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా జిల్లా ఆసుపత్రిలో మంగళవారం ఆరోగ్య అవగాహన కల్పించారు.

మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది

పెద్దపల్లిటౌన్‌, ఏప్రిల్‌ 7 (ఆంఽధ్రజ్యోతి): మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ కె.ప్రమోద్‌కుమార్‌ పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా జిల్లా ఆసుపత్రిలో మంగళవారం ఆరోగ్య అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ మంచి జీవనశైలి, ఆహారపు అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, సీజన్‌లో లభించే తాజా కూరగాయలు, పండ్లు, మిల్లెట్స్‌, పెరుగు లాంటి ఆహారంతో పాటు అదనంగా ఖర్జూర, బాదం తీసుకోవాలన్నారు. ఉప్పు, చక్కెరలను తగ్గించాలని, 30 నిమిషాలు వ్యాయామం చేయాలని, బయటి ఆహార పదార్థాలు, జంక్‌ ఫుడ్స్‌, శీతల పానీయాలు తీసుకోకూడదన్నారు. నీరు ఎక్కువగా తాగాలని, సిగరెట్‌, బీడీ, తంబాకు, మద్యం సేవించరాదని ఆయన పేర్కొన్నారు. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో వ్యాక్సిన్లను వేయించడం వలన 12 రకాల వ్యాధులను రాకుండా నివారించవచ్చని. సొంతంగా మందులు వాడకుండా డాక్టర్లు సూచించిన మందులు మాత్రమే వాడాలన్నారు. ప్రోగ్రాం అధికారి, డాక్టర్‌ బి శ్రీరాములు, ఆర్‌ఎంవో డాక్టర్‌ విజయ్‌, వైద్య అధికారి డాక్టర్‌ లక్ష్మీ భవాని, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ జమున, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, డీపీఎంవో రమేష్‌, ఎస్‌యువో రవీందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2026 | 11:49 PM