అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలకు ఓర్వలేనితనం
ABN , Publish Date - Oct 18 , 2026 | 12:09 AM
సీఎం రేవంత్రెడ్డి చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మండల కేంద్రంలో శనివారం 50 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు.
కాల్వశ్రీరాంపూర్, అక్టోబరు17(ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్రెడ్డి చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మండల కేంద్రంలో శనివారం 50 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. ఆయన మాట్లాడు తూ ప్రభుత్వం కల్యాణలక్ష్మి చెక్కులు అందిస్తున్నా ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తు న్నారన్నారు. వేసవిలో వరికి బదులు నువ్వులు, పొద్దు తిరుగుడు, మొక్కజొన్న, పల్లి ఆరుతడి పంటలు వేసుకో వాలని సూచించారు. ప్రస్తుత ఖరీఫ్లో రైతుల పం టలకు సాగునీరు అందించేందుకు సీఎం, మంత్రుల సహకారాలతో ఎస్సారెస్పీ నుంచి డి 86, 83 ద్వారా సాగునీరు అందుతుందన్నారు. మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, తహసిల్దార్ రాపెల్లి రాముడు, సర్పం చ్లు రమేష్, రామచంద్రారెడ్డి, పాల్గొన్నారు.
తెలంగాణ గొప్ప పండుగ బతుకమ్మ
తెలంగాణలో గొప్ప పండుగ బతుకమ్మఅని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. గోపగాని పర్శరాములు జ్ఞాపకార్థం మాజీ ఎంపిపి సార య్యగౌడ్ కాల్వశ్రీరాంపూర్, రాయపేటలో బతుకమ్మ ఘాటుల వద్ద బతుకమ్మ విగ్రహాలను శనివారం విప్ ప్రారంభించారు.
సాగునీరు వృథా చేయొద్దు
పెద్దపల్లి రూరల్, (ఆంధ్రజ్యోతి): వరిసాగు చేస్తున్న రైతులు సాగునీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజ యరమణరావు అన్నారు. శనివారం రైతులకు ఉపయో గపడే ఎల్లమ్మ గుండమ్మ చెరువు లోకి వెళ్లే కాలువను పరిశీలించారు. సూపర్ ఎల్నినో ప్రభావం తో రానున్న రోజుల్లో తాగునీటి ఎద్దడి లేకుండా, భూగర్భ జలాలు అడుగంటి పోకుండా చెరువును నింపేందుకు చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్ తెలిపారు. మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, సింగిల్విండో చైర్మన్ ముత్యా ల నరేష్, కౌన్సిలర్లు జగదీష్, అస్లాంపర్వేజ్, అమ్రేష్, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, పాల్గొన్నారు.