Share News

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కార్మికుల్లో వ్యతిరేకత

ABN , Publish Date - Oct 15 , 2026 | 11:37 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగిస్తున్న ప్రజా వ్యతిరేక విధానా లపై సింగరేణి కార్మికుల్లో తీవ్ర ఆక్రోషం, ఆవేదన నెలకొన్నాయని, కాంగ్రెస్‌ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెర వేర్చకుండా కార్మికులను మోసం చేశాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. గురువారం ప్రెస్‌ క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాటా ్లడారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కార్మికుల్లో వ్యతిరేకత

గోదావరిఖని, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగిస్తున్న ప్రజా వ్యతిరేక విధానా లపై సింగరేణి కార్మికుల్లో తీవ్ర ఆక్రోషం, ఆవేదన నెలకొన్నాయని, కాంగ్రెస్‌ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెర వేర్చకుండా కార్మికులను మోసం చేశాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. గురువారం ప్రెస్‌ క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాటా ్లడారు. కార్మికుల ఐక్యత ముందు ఏ శక్తి నిలువదని నిరూపించే విధంగా సింగరేణి కార్మిక గర్జన విజ యవంతమైందన్నారు. సభను విజయవంతం చేసిన కార్మిక కుటుంబాలకు, కోల్‌బెల్ట్‌ ప్రజలకు, బీఆర్‌ఎస్‌ శ్రేణులకు టీబీజీకేఎస్‌ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. మూడేళ్లలో సింగరేణిలో కేవలం 9 మెడికల్‌ బోర్డులు నిర్వహించి 51మందిని మాత్రమే అన్‌ఫిట్‌ చేయడం దారుణమన్నారు. ఆపరేషన్లు అయిన వారిని, కిడ్నీలు పాడైన వారిని, పక్షవాతం వచ్చిన వారిని బలవం తంగా సింగరేణిలో పని చేయిస్తున్నారని ఆరోపిం చారు. సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిపోవడం వల్ల బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయి అవినీతి కుంభకోణాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సింగరేణి ఉత్పత్తి తగ్గడం వల్ల థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తిపై ప్రభావం పడిందని, ఫలితంగా కరెంటు కోతలు, లోఓల్టేజీతో కాలిపోతున్న ట్రాన్స్‌ఫార్మర్లు, ఎండిపోతున్న పంట పొలాలు దర్శనమిస్తున్నాయన్నారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ కోలేటి దామోదర్‌, కార్పొరేటర్‌ సమ్మ య్యయాదవ్‌, నాయకులు మురళీధర్‌రావు ఉన్నారు.

Updated Date - Oct 15 , 2026 | 11:37 PM