ఏఐతో అన్ని రంగాల్లో అవకాశాలు
ABN , Publish Date - Jun 14 , 2026 | 12:09 AM
కృతిమ మేధస్సు, సృజనాత్మక సాంకేతిక రంగాల్లో నిరుద్యోగ యువతకు అపారమైన అవకాశాలు ఉన్నాయని మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్‌రెడ్డిలు అన్నారు. టాస్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన రన్‌వే మీట్ అప్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మంథని, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): కృతిమ మేధస్సు, సృజనాత్మక సాంకేతిక రంగాల్లో నిరుద్యోగ యువతకు అపారమైన అవకాశాలు ఉన్నాయని మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్‌రెడ్డిలు అన్నారు. టాస్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన రన్‌వే మీట్ అప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ యువ తకు అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలను అందిం చాలనే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు మంథనిలో టాస్క్ సెంటర్‌ను ఏర్పాటు చేయించారు. టాస్క్‌లో శిక్షణ ద్వారా యువత సాం కేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని భవిష్యత్‌లో విజ యవంతమైన కెరీర్‌ను నిర్మించుకోవాలని సూచిం చారు. వీడియో క్రియేషన్, జనరేటీవ్ ఏఐ, డిజిటల్ కంటెంట్ తయారీ అంశాలపై, రన్‌వే టూల్స్‌ను ఉప యోగించుకొని తక్కవ సమయంలో అధిక నాణ్యత కల్గిన కంటెంట్‌ను ఎలా రూపొందించాలో రన్‌వే కమ్యూనిటీ బిల్డర్ అరవింద్ వివరించారు. ఏఐ, ఏబీజీసీ-ఎక్స్‌ఆర్ రంగాల్లో యువతకు మరిన్ని శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని టాస్క్ సెంటర్ హెడ్ పనకంటి రాకేష్ తెలిపారు. ఈకార్యక్రమంలో కౌన్సిలర్ స్రవంతి, విద్యార్థులు పాల్గొన్నారు.