Share News

ప్రభుత్వం సూచించిన సన్నరకాలనే సాగు చేయాలి

ABN , Publish Date - Jun 23 , 2026 | 11:57 PM

వానాకా లం సీజన్‌లో ప్రభుత్వం సూచించిన సన్న రకపు వరి సాగు చేసి రైతులు బోనస్‌ పొందాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ సూచించారు. మంగళవారం మం డల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో విత్తన మేళా కార్యక్రమాన్ని కలెక్టర్‌ కోయశ్రీ హర్షతో కలిసి ప్రారంభించి మాట్లాడారు.

ప్రభుత్వం సూచించిన సన్నరకాలనే సాగు చేయాలి

ధర్మారం, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): వానాకా లం సీజన్‌లో ప్రభుత్వం సూచించిన సన్న రకపు వరి సాగు చేసి రైతులు బోనస్‌ పొందాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ సూచించారు. మంగళవారం మం డల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో విత్తన మేళా కార్యక్రమాన్ని కలెక్టర్‌ కోయశ్రీ హర్షతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. యాసంగిలో పెద్ద మొత్తంలో పండిన వరి, మొక్కజొన్నను అధికారులు సమన్వయంతో పని చేసి రికార్డు స్థాయిలో కొనుగోలు చేశారని కితాబిచ్చారు. ధాన్యం కొనుగోలు చేసిన నాలు గైదు రోజుల్లో రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమచేసిందని తెలిపారు. ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెనకడుగు వేయలే దని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం సూచిస్తున్న ఏడు రకాల సన్నాలనే రైతులు పండించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. యాప్‌ ద్వారా యూరి యా కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బం దులు లేకుండా చర్యలు తీసుకుంటాన్నామని కలెక్టర్‌ తెలిపారు. దొడ్డు రకాల ధాన్యానికి డిమాండ్‌ లేదని, రైతలు సన్నాలను సాగు చేయాలని సూచించారు. మండలంలో విద్యుత్‌ షాక్‌తో మరణించిన కుటుంబాలకు పరిహారపు చెక్కులను మంత్రి అందజేశారు.

విపక్షాల తప్పుడు ప్రచారం

సుల్తానాబాద్‌, (ఆంధ్రజ్యోతి): వానాకాలం సీజన్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మేలు రకాలైన ఏడు వరి విత్తనాలను ఎంపిక చేసి రైతులకు పంపిణీ చేస్తే విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ప్రభుత్వ విప్‌, ఎమ్మె ల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. కాట్నపల్లి రైతువేదికలో విత్తనాల పంపిణీ చేశా రు. ఆయన మాట్లాడుతు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. ఏ పంటను సక్రమంగా కొనుగోలు చేయని కేంద్రంలోని బీజేపీప్రభుత్వం రైతులను మభ్య పెట్టడం ఎంత వరకు సమం జసమన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌, ఎగు మతి అవకాశా లను దృష్టిలో ఉంచుకుని వ్యవ సాయ శాస్త్రవేత్తల, నిఫుణుల సబ్‌ కమిటీ సూచించిన ఏడు రకాల విత్తనాలు ఎంపిక చేశామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని సకాలంలో విత్తనాలు, ఎరువులు అందిస్తుందన్నారు. ఈ రైతు సదస్సులో ఏడు రకాల విత్తనాల సంచులను ప్రదర్శించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతటి అన్నయ్య గౌడ్‌, మార్కెట్‌ చైర్మన్‌ మినుపాల ప్రకాష్‌ రావు, సొసైటీ చైర్మన్‌ శ్రీగిరి శ్రీనివాస్‌, సర్పంచ్‌ ఓగుల పూజ రాజేందర్‌, జూపల్లి తిరుమల్‌ రావు, ఆనందరావు, మండల వ్యవసాయ అధికారి పైడితల్లి, రైతులు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 23 , 2026 | 11:57 PM