Share News

ఆయిల్‌పామ్‌ తోటలపై మొగ్గు చూపాలి

ABN , Publish Date - Aug 09 , 2026 | 12:21 AM

రైతులు పామాయిల్‌ తోటల వైపు మొగ్గు చూపాలని ఉద్యా నవన శాఖ అధికారి రాము అన్నారు. శనివారం కాల్వ శ్రీరాంపూర్‌లో పుప్పాల విక్రమసింహారావుకు చెందిన ఆరు ఎకరాలలో మొక్కలను నాటారు.

ఆయిల్‌పామ్‌ తోటలపై మొగ్గు చూపాలి

కాల్వశ్రీరాంపూర్‌, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): రైతులు పామాయిల్‌ తోటల వైపు మొగ్గు చూపాలని ఉద్యా నవన శాఖ అధికారి రాము అన్నారు. శనివారం కాల్వ శ్రీరాంపూర్‌లో పుప్పాల విక్రమసింహారావుకు చెందిన ఆరు ఎకరాలలో మొక్కలను నాటారు. ఆయన మాట్లా డుతూ ప్రస్తుత సంవత్సరానికి మండలంలో 107 ఎక రాల్లో పామాయిల్‌ సాగు చేయించామన్నారు. పలు వురు రైతులు ఆయిల్‌పామ్‌ తోటల సాగు కు ముందుకు వస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సా హకాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రైతులు పాల్గొన్నారు.

పత్తిలో అంతర పంటలతోనే ఆదాయం

ముత్తారం, (ఆంధ్రజ్యోతి): పత్తిలో అంతర పంటలతోనే అదనపు ఆదాయం వస్తుందని ఎల్‌ఆర్‌ఏ ఫీల్డ్‌ ఆఫీసర్‌ ఎస్‌.రాజశేఖర్‌ తెలిపారు. శనివారం లక్కారంలో రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పత్తి పంటలో అంతర పంటలు వేసుకోవాలని, భూసార పరీక్షల ఆధారంగానే ఎరువులు వాడాలని సూచించారు. పంట వేసిన 45 రోజుల వరకు ఎలాంటి పురుగు మందులు పిచికారీ చేయకూడదని చెప్పారు.

Updated Date - Aug 09 , 2026 | 12:21 AM