బీథర్మల్‌ను సందర్శించిన అధికారులు
ABN , Publish Date - Jun 23 , 2026 | 11:56 PM
రామ గుండంలో మూతపడిన 62.5 మెగావాట్ల బీ థర్మల్ విద్యుత్ కేంద్రం స్థానంలో 800 మెగా వాట్ల విద్యుత్ కేంద్ర స్థాపన విషయంలో సాధ్యాసాధ్యాల అంచనా కోసం క్షేత్రస్థాయి పరి శీలనకు వచ్చినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎనర్జీ సెక్రటరీ నవీన్ మిట్టల్ అన్నారు.
అంతర్గాం, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): రామ గుండంలో మూతపడిన 62.5 మెగావాట్ల బీ థర్మల్ విద్యుత్ కేంద్రం స్థానంలో 800 మెగా వాట్ల విద్యుత్ కేంద్ర స్థాపన విషయంలో సాధ్యాసాధ్యాల అంచనా కోసం క్షేత్రస్థాయి పరి శీలనకు వచ్చినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎనర్జీ సెక్రటరీ నవీన్ మిట్టల్ అన్నారు. మంగళవారం జెన్‌కో, ట్రాన్స్‌కో, సీఎండి హరీష్, డైరెక్టర్ రాజిరెడ్డిల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బీ థర్మల్ అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు వారికి స్వాగతం పలికి సన్మానించారు. ఈ బృందం మొదట రామ గుండం పట్టణం, ప్లాంటులోని పలు విభాగా లను పరిశీలించారు. అనంతరం స్థానిక అధికా రులతో కలిసి పవర్‌హౌస్‌లోని చాంబర్‌లో పలు విషయాలపై చర్చించారు. నవీన్ మిట్టల్ మాట్లాడుతూ 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తే స్థలం లభ్యత, నీరు, రైల్వే రోడ్డు మార్గం ఇతర సౌకర్యాలు ఎలా ఉన్నాయో తెలు సుకునేందుకే వచ్చామన్నారు. పాత విద్యుత్ కేంద్రం తొలగించే ప్రక్రియ ఎంత వరకు వచ్చిందని విలేకరులు ప్రశ్నించగా, పాత ప్లాం టు తొలగించి స్ర్కాప్ తరలింపు విషయంలో అంచనాలు సిద్ధం చేస్తున్నామని, అనంతరం టెండర్లు పిలిచే అవకాశం ఉందన్నారు. స్థానిక ఎస్‌ఈ దాసరి శంకరయ్య, డీఈ శ్రీనివాసరావు తోపాటు ఇంజనీర్లు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ప్లాంటు ఏర్పాటు చేయండి
ఉన్నతాధికారుల బృందానికి రామగుండం డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు కలిసి విద్యుత్ కేం ద్రం స్థాపనకు కృషి చేయా లని కోరారు. ఇక్కడ అన్ని వనరులు అందుబాటులో ఉన్నాయని, సీఎం రేవంత్‌రెడ్డి, పవర్ మినిస్టర్ ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్కలు ఇక్కడ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, ప్రభుత్వానికి స్థానిక నాయకులు ప్రజలు అన్ని విధాల సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్, కార్పొరేటర్లు ఇస్సాంపల్లి అంజయ్య, సిరిశెట్టి సతీష్, ముస్తాఫా, డీసీసీ ఉపాధ్యక్షుడు దీటి బాలరాజు, పట్టణ అధ్యక్షుడు ఈదునూరి హరిప్రసాద్ పాల్గొన్నారు.