పేద మహిళలకు ఎన్టీపీసీ చేయూత
ABN , Publish Date - Mar 21 , 2026 | 12:14 AM
ఎన్టీపీసీ సీఎస్‌ఆర్ ఆధ్వర్యంలో కొన్ని నెలలుగా ప్రభావిత ప్రాంతాల మహిళలకు నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ శిబిరం శుక్రవారం ముగిసింది. టీటీఎస్‌లోని ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్‌లో నిర్వ హించిన కార్యక్రమంలో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు, మెటీరి యల్‌ను పంపిణీ చేశారు.
జ్యోతినగర్, మార్చి 20(ఆంధ్రజ్యోతి): ఎన్టీపీసీ సీఎస్‌ఆర్ ఆధ్వర్యంలో కొన్ని నెలలుగా ప్రభావిత ప్రాంతాల మహిళలకు నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ శిబిరం శుక్రవారం ముగిసింది. టీటీఎస్‌లోని ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్‌లో నిర్వ హించిన కార్యక్రమంలో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు, మెటీరి యల్‌ను పంపిణీ చేశారు. కార్యక్రమానికి దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ సామంత ముఖ్యఅతిథిగా పాల్గొని ధ్రువీకరణ పత్రాలు అందించారు. అనంతరం ఆమె ప్రసంగిస్తూ ఈ ప్రాంత పేద మహిళలకు స్వయం ఉపాధి కల్పనలో సీఎస్‌ఆర్ ఆధ్వర్యంలో పలు రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నా మని తెలిపారు. మహిళా సాధికారిత కోసం ఎన్టీపీసీ ఎప్పుడు కృషి చేస్తుం దన్నారు. మహిళలు తమ కాళ్లపై తామే నిలబడేందుకు శిక్షణ ఉపయోగపడు తుందన్నారు. ఎన్‌టీపీసీ సీఎస్‌ఆర్ అధికారులు, దీప్తి మహిళా సమితి సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.